
📌 Key Points
- సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహినూర్’, ‘బ్యాడాస్’ చిత్రాలు ఆగిపోయినట్లు వార్తలు. గతంలో రవి కాంత్ పేరేపుతో చేయాల్సిన ఈ ప్రాజెక్టులు కొన్ని కారణాల వల్ల నిలిచిపోయాయి.
- దర్శకుడు రవి కాంత్ పేరేపుతో రూపొందాల్సిన ‘కోహినూర్’ మరియు ‘బ్యాడాస్’ ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
- ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జెతో సిద్ధూ కొత్త సినిమాకు కమిట్ అయ్యారు. ఇది ఒక యూనిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది.
- నాగ వంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న సిద్దు జొన్నలగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘కోహినూర్’, ‘బ్యాడాస్’ వంటి తన రెండు ప్రాజెక్టులను పక్కన పెట్టి, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో కొత్త సినిమాకు కమిట్ అయ్యారు.
సిద్ధూ పక్కన పెట్టిన రెండు సినిమాలు
Siddu jonnalagadda: వైవిద్య భరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఒకరు. ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సిద్ధూ జొన్నలగడ్డ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోతున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా అనంతరం జాక్, తెలుసు కదా వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.
సిద్దు జొన్నలగడ్డ రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే ఆ రెండు సినిమాలు ఆగిపోయాయని టాలీవుడ్ సమాచారం. కృష్ణ అండ్ హిస్ లీల ఫేమ్ డైరెక్టర్ రవి కాంత్ పేరేపు దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ కోహినూరు అనే సినిమాకి కమిట్ అయ్యారు, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది అనంతరం ఈయన ఇదే కాంబినేషన్లో బ్యాడాస్ అనే సినిమాకు కమిట్ అయ్యారు కానీ ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత ఆగిపోయినట్టు సమాచారం. ఇలా ఈ రెండు సినిమాలు ఆగిపోయాయనే విషయం సోషల్ మీడియాలో తెలియడంతో అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాల గురించి చిత్ర బృందం ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు.
కొత్త ప్రాజెక్ట్‌కు కమిట్ అయిన సిద్ధూ
ఈ రెండు సినిమాలు ఆగిపోయాయి అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం మరో కొత్త ప్రాజెక్టుకు కమిట్ అయ్యారంటూ మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమాని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె తో కమిట్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాని నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ఒక యూనిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. ఇలా సిద్దు జొన్నలగడ్డ రెండు సినిమాలు పక్కన పెట్టి మరో కొత్త సినిమాకు కమిట్ అవ్వడంతో అభిమానులు కూడా ఈ సినిమా పట్ల కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక సిద్దు జొన్నలగడ్డ చివరిగా తెలుసు కదా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజకోన దర్శకురాలిగా మారి చేసిన మొదటి సినిమా కావటం విశేషం. శ్రీనిధి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ నెలలో విడుదలైంది.
స్వరూప్ ఆర్ ఎస్ జెతో సిద్ధూ జొన్నలగడ్డ
రెండు సినిమాలు పక్కన పెట్టి సిద్ధూ కొత్త ప్రాజెక్ట్‌కు కమిట్ అవ్వడం అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా సిద్ధూకు మళ్లీ మంచి విజయాన్ని అందిస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.


