
📌 Key Points
- సింగర్ మంగ్లీ, డైరెక్టర్ వేణు ఉడుగులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు – సెక్షన్ 351 (2), 352 కింద అభియోగాలు!
- సుమారు 100 మంది దగ్గర పెట్టుబడుల పేరుతో భారీగా డబ్బు వసూలు చేసిన మంగ్లీ బృందం – లాభాలు ఇవ్వలేదని ఆరోపణలు!
- న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదులో సంచలన విషయాలు – మంగ్లీ, శివ, వేణు ఉడుగుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపణ!
- రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదు – దీనిపై మంగ్లీ, వేణు ఉడుగుల స్పందన కోసం ఎదురుచూపులు!
టాలీవుడ్‌లో మరో సంచలనం! సింగర్ మంగ్లీ, దర్శకుడు వేణు ఉడుగులపై కేసు నమోదు కావటం హాట్ టాపిక్‌గా మారింది. పెట్టుబడుల వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
మంగ్లీ, వేణు ఉడుగులపై కేసు నమోదుకు కారణం ఏంటి?
Mangli : తాజాగా ప్రముఖ గాయని మంగ్లీపై, దర్శకుడు వేణు ఉడుగులపై పోలీసు కేసు నమోదైంది. మంగ్లీ, మరో ముగ్గురి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 351 (2), 352 కింద వీరిపై కేసు నమోదు చేసారు.
కేసు వివరాల్లోకి వెళ్తే..
న్యాయవాదికి బెదిరింపులు.. అసలేం జరిగింది?
మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది దగ్గర వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి భారీగా డబ్బు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎంతకాలం అయినా కూడా లాభాలు ఇవ్వకపోగా అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. దీంతో బాధితుల తరపున ఆయన ఈ వ్యవహారంపై స్పందించారు.
పెట్టుబడుల పేరుతో మోసం.. బాధితుల ఆవేదన!
బాధితులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో న్యాయవాది మంగ్లీ, ఆమె బృందంని నిలదీయగా ఇతన్ని బెదిరించారు. దాంతో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారని, తనను రోడ్డు ప్రమాదం చేయించి చంపేస్తామని వారు హెచ్చరించారని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ బెదిరింపుల వ్యవహారంలో దర్శకుడు వేణు ఉడుగుల పాత్ర కూడా ఉందని న్యాయవాది పోలీసులకు తెలిపారు. దీంతో పెట్టుబడుల పేరుతో సామాన్యులను మోసం చేయడమే కాక బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మంగ్లీ, దర్శకుడు వేణు ఉడుగుల ఇంకా స్పందించలేదు.
మంగ్లీ, వేణు ఉడుగులపై కేసు నమోదు వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై వారి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


