|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Singer Mangli: బూతు పాట వివాదం పై స్పందించిన మంగ్లీ.. క్షమించండంటూ!

Published: 18-03-2026, 8:35 AM
  • మంగ్లీ పాడిన పాట డబుల్ మీనింగ్ డైలాగులతో ఉండటంతో వివాదం
  • పాటను నిషేధించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ కు ఫిర్యాదు
  • ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పాటను తొలగించినట్లు మంగ్లీ ప్రకటన
  • సంగీత దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపిన మంగ్లీ

సింగర్ మంగ్లీ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె పాడిన ఒక పాట డబుల్ మీనింగ్ లిరిక్స్ కలిగి ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగ్లీ స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు. ఆ పాటను సోషల్ మీడియా నుండి తొలగించినట్లు ప్రకటించారు.

వివాదానికి కారణమైన పాట

Singer Mangli: సింగర్ మంగ్లీ ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. జానపద గేయాలు పాడుతూ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలను అందుకున్నారు. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించిన మంగ్లీ(Mangli) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఇతర భాషలలో కూడా పాటలు పాడుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా మంగ్లీ ధ్రువ సర్జా కథానాయకుడిగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం KD: ది డెవిల్ (KD: The Devil)సినిమా కోసం ఒక పాటను ఆలపించారు.

ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి “సర్కే చునర్ తేరి సర్కే” అంటూ సాగిపోయే ఒక స్పెషల్ సాంగ్ విడుదల చేశారు.ఇక ఈ పాట లిరిక్స్ కాస్త డబుల్ మీనింగ్ డైలాగులతో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఇక ఈ పాట విషయంలో నిషేధం విధించాలని కోరుతూ ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ కు ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

మంగ్లీ క్షమాపణ ప్రకటన

ఇలా ఈ పాటలో అశ్లీలత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పాటను నిషేధించాలి అంటూ సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకత ఏర్పడింది అలాగే ఈ సినిమా కోసం పనిచేసిన దర్శకుడు సంగీత దర్శకుడు అలాగే ఈ పాటకు సాహిత్యం అందించిన వారు అలాగే సింగర్ మంగ్లీ పై కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఇలా ఈ పాట వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఈ పాటను డిలీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సింగర్ మంగ్లీ సైతం ఈ వివాదం పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మంగ్లీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ అందరికి క్షమాపణలు చెప్పడమే కాకుండా పునరావృతం కాదని తెలిపారు.

పాట తొలగింపునకు కారణం

ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ నుంచి ఈ పాటను తొలగించామని, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేస్తున్నాను.. ఈ పాట విషయంలో జరిగిన పొరపాటుకు మేము చింతిస్తున్నాము. ఎవరి మనోభావాలను దెబ్బతీయటం మా ఉద్దేశం కాదని తెలిపారు. ఇక ఈ పాట విషయంలో కొన్ని మార్పులు కూడా జరిగాయని ఇలా మార్చిన పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు మంగ్లీ తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఈ తప్పు మళ్లీ పునరావృతం కాదని మీకు హామీ ఇస్తున్నాను అంటూ మంగ్లీ తెలిపారు. అలాగే ఈ సినిమాలో పాడే అవకాశం తనకు కల్పించినందుకు సంగీత దర్శకుడు అర్జున్ జన్యకు అభినందనలు అంటూ ఈమె ఈ వివాదం పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలియచేయడంతో ఈ వివాదానికి పులిస్టాప్ పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం మంగ్లీ పోస్ట్ వైరల్ అవుతుంది.

మంగ్లీ తన పాట విషయంలో జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పాటను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.