|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: విజయ్‌తో త్రిష ప్రేమకు బ్రేక్? అసలు నిజం చెప్పిన సింగర్ సుచిత్ర!

Published: 04-03-2026, 12:35 AM
షాకింగ్: విజయ్‌తో త్రిష ప్రేమకు బ్రేక్? అసలు నిజం చెప్పిన సింగర్ సుచిత్ర!
  • విజయ్ వ్యక్తిగత విషయాలను ప్రత్యర్థులు విమర్శిస్తున్నారని సింగర్ సుచిత్ర వ్యాఖ్య.
  • త్రిష, ఉదయనిధి స్టాలిన్‌ను ప్రేమిస్తుందని సుచిత్ర సంచలన ప్రకటన.
  • సుచిత్ర వ్యాఖ్యల పట్ల తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని సమాచారం.
  • విజయ్, త్రిషల మధ్య సంబంధం లేదని సుచిత్ర స్పష్టీకరణ.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న వేళ ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. త్రిషతో విజయ్‌కు సంబంధం ఉందనే వార్తలపై సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

విజయ్ పై ప్రత్యర్థుల విమర్శలు

Trisha – Vijay: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీని స్థాపించి, ఈ పార్టీతో ఈసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా అధికార పార్టీకి పోటీగా తన పార్టీతో రంగంలోకి దిగడమే కాకుండా పలు బహిరంగ ప్రదేశాలలో తన పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి విజయ్ కి అడ్డుకట్ట వేయడానికి కొంతమంది ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిగత విషయాలను బయటకు తీస్తూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ త్రిష (Trisha ) ఇంటి నుండి బయటకు రావాలి అంటూ ఇటీవల బీజేపీ నాయకులు ఆయనపై కామెంట్లు చేశారు.. దీంతో మండిపడ్డ త్రిష ఆ బిజెపి నాయకుడి పై తనదైన శైలిలో మండిపడింది. వెంటనే దిగివచ్చిన ఆ బిజెపి నాయకుడు త్రిషకి క్షమాపణలు చెప్పారు.

అయితే ప్రత్యర్ధులు అంతటితో ఆగకుండా మరొకవైపు ఆయన వైవాహిక జీవితంలోకి వేలు పెట్టారు. ఆయన భార్య సంగీత (Sangeetha ) విజయ్ కి విడాకులు ఇవ్వబోతుందని ,దీనికి కారణం త్రిష తో విజయ్ పెట్టుకున్న ఎఫైర్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ చేస్తున్న నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో కూడా విజయ్ – త్రిష తో రిలేషన్ కొనసాగిస్తున్నారనే వార్తలు వస్తున్న కారణంగా.. ప్రముఖ సింగర్ ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా ఊహించని కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు “సుచీ లీక్స్” ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ సింగర్ సుచిత్ర(Suchitra).

త్రిష ప్రేమ వ్యవహారంపై సుచిత్ర కామెంట్స్

సుచిత్ర ఇటీవల ఒక టీవీ ఛానల్ లో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ..” సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా త్రిష విజయ్ ని ఇష్టపడడం లేదు. ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటే ఉండొచ్చు కానీ మాత్రం లవ్ మాత్రం చేయడం లేదు. ఆమె ఉదయనిధి స్టాలిన్ ను ప్రేమిస్తుందని సమాచారం. ఆ మధ్య వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిషకి ఎంగేజ్మెంట్ అయ్యింది.. దానిని ఉదయ్ నిధి క్యాన్సిల్ చేయించాడు ” అంటూ సుచిత్ర సంచలన కామెంట్లు చేసింది.. ఇక ప్రస్తుతం సుచిత్ర చేసిన ఈ కామెంట్స్ తమిళనాడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దీంతో ఒకరకంగా విజయ్ కి ఫేవర్ గా సుచిత్ర ఈ కామెంట్లు చేసిందని, ప్రత్యర్థులకు ఈ వార్త చెక్ పెట్టే అంశమని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి సుచిత్ర చేసిన కామెంట్లలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మరొకవైపు త్రిష వల్లే విజయ్ కి తన భార్య విడాకులు ఇవ్వబోతోంది అనే వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

తమిళనాడులో ప్రకంపనలు

ఇకపోతే విజయ్ కి ముందు నుయ్యి వెనక గొయ్యి లా తన పరిస్థితి ఏర్పడింది. అటు రాజకీయంగా ఎదగాలని చూస్తున్న ఆయనకు ఇలాంటి వ్యక్తిగత ఇబ్బందులు మరింత కృంగదీస్తున్నాయి. విజయ్ భార్య సంగీత 28 ఏళ్ల తర్వాత విజయ్ కి వ్యతిరేకంగా విడాకుల నోటీసులు ఇవ్వడంతో ఆ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే సంగీతను ఎలాగైనా సరే ఒప్పించి విడాకుల ఆలోచనను విరమించుకునేలా చేసి.. ఆయన కోసం ప్రచారం చేసేలా కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారట. మరి కుటుంబ సభ్యుల మేరకు సంగీత తన ఆలోచనలను పునరాలోచన చేసి తన భర్త కోసం రాజకీయ ప్రచారానికి వస్తుందేమో చూడాలి.

మొత్తానికి సుచిత్ర చేసిన ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై త్రిష, విజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వార్త ప్రత్యర్థులకు ఏ మేరకు చెక్ పెడుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.