
📌 Key Points
- విజయ్, త్రిష మధ్య సంబంధంపై పుకార్లు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి.
- విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ వెనుక త్రిషతో ఎఫైర్ కారణమని వార్తలు.
- సింగర్ సుచిత్ర త్రిషను “పరాన్నజీవి”గా అభివర్ణిస్తూ సంచలన కామెంట్లు చేసింది.
- విజయ్ ఒంటరితనాన్ని త్రిష వాడుకుంటుందని సుచిత్ర ఆరోపణ.
కోలీవుడ్ స్టార్ విజయ్ ఒంటరితనాన్ని త్రిష వాడుకుంటుందని సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. త్రిషను పరాన్నజీవిగా అభివర్ణించిన సుచిత్ర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట పెను దుమారం రేపుతున్నాయి. విజయ్, త్రిష బంధంపై చర్చ మళ్లీ మొదలైంది.
విజయ్-త్రిష బంధంపై పుకార్లు, అభిమానుల స్పందన
Kollywood: నిజానికి కోలీవుడ్ స్టార్ హీరో , హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష – విజయ్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో ఎవరికి అధికారికంగా తెలియకపోయినా.. వీరిద్దరూ సెలబ్రిటీలు.. పైగా కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్య ఏదో తెలియని రహస్య బంధం ఉందనే పుకార్లు మాత్రం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి..దీనికి తోడు జీవితాన్ని పంచుకున్న భాగస్వామి సంగీత కూడా విజయ్ కి ఒక సినీ నటితో ఎఫైర్ రిలేషన్ ఉంది.. ఆ కారణంగానే తాను విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ కూడా వేసింది. దీంతో విజయ్ అభిమానులు విజయ్ కి త్రిష దూరంగా ఉండాలి అని , తన అన్న కాపురాన్ని కూల్చవద్దు అంటూ కామెంట్లు కూడా చేశారు.
మరి కొంతమంది విజయ్ విజయానికి కారణం త్రిష అని, విజయ్ ఈ స్థాయిలో పార్టీ పెట్టిన తక్కువ సమయంలోనే అధికారంలోకి రావడం వెనుక త్రిష హస్తము ఉంది అనే రేంజ్ లో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.. దీనికి తోడు తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలను దర్శించుకున్న త్రిష తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయ్ మందంజలో ఉన్నాడని తెలిసిన వెంటనే.. ఆయన ఇంటికి వెళ్లి ప్రసాదం ఇవ్వడం , ఆ తర్వాత ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో కూడా త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడంతో అందరూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సింగర్ సుచిత్ర చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈమెను ఒక పరాన్నజీవి తో పోల్చుతూ విజయ్ ఒంటరితనాన్ని త్రిష వాడుకుంటుంది అంటూ చేసిన కామెంట్లు నెట్టింట పెను దుమారాన్ని రేపుతున్నాయి.
త్రిషపై సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
ఇకపోతే సుచీ లీక్స్ పేరిట గతంలో ఇండస్ట్రీలో జరిగే విషయాలను నేరుగా మాట్లాడుతూ వార్తల్లో నిలిచిన ఈమె.. అప్పట్లో కొంతమంది తనపై లైంగికంగా దాడి కూడా చేశారు అనే రేంజ్ లో ఆరోపణలు చేసింది. స్టార్ హీరోలతో పర్సనల్గా దిగిన ఫోటోలను, వాట్సప్ స్క్రీన్ షాట్ లను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి వైరల్ అయింది. అలాంటి ఈమె ఇప్పుడు త్రిషపై సంచలన కామెంట్లు చేసింది. సుచిత్ర మాట్లాడుతూ.. “నాకు త్రిష అంటే అసలు ఇష్టం ఉండదు . విజయ్ అంటే చాలా గౌరవం, అభిమానం, ఇష్టం కూడా.. అందుకే నా అభిప్రాయాన్ని నేను నిష్పక్షపాతంగా చెబుతున్నాను. విజయ్ ప్రస్తుతం తల్లిదండ్రులకు, భార్యకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలోనే పరాన్న జీవులు లాంటి వ్యక్తులు విజయ్ జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ఒంటరితనాన్ని వాడుకొని కొందరు ఆయనకు భారంగా మారుతున్నారు అంటూ సుచిత్ర చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
సుచిత్ర గత వివాదాలు, తాజా ఆరోపణలు
ఏది ఏమైనా త్రిషపై డైరెక్ట్ గా సుచిత్ర చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారి తీయగా.. దీనిపై త్రిష ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి. ఇదిలా ఉండగా మరొకవైపు త్రిష విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడడమే కాకుండా.. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తనకు మరింత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది. అంతేకాదు ఈరోజు ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంటూ సంతోషం మరింత బిగ్గరగా ఉంటుంది అంటూ పోస్ట్ పెట్టింది.
సుచిత్ర చేసిన ఈ సంచలన కామెంట్లు కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. విజయ్, త్రిష బంధంపై మరోసారి అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


