|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 5 ఏళ్లుగా పాటల్లేవ్.. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సుజాత మోహన్!

Published: 06-04-2026, 8:35 AM
షాకింగ్: 5 ఏళ్లుగా పాటల్లేవ్.. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సుజాత మోహన్!
  • సింగర్ సుజాత మోహన్ గొంతు సమస్యతో ఐదేళ్లుగా పాటలకు దూరం!
  • 20 వేలకు పైగా పాటలు పాడిన సుజాతకు ఇది నిజంగా బాధాకరమైన పరిస్థితి!
  • సంగీతాన్ని విడిచిపెట్టనని, త్వరలోనే మళ్లీ పాడతానని సుజాత ధీమా!
  • సుజాతకు మెరుగైన వైద్యం అందించాలని ఏఆర్ రెహమాన్ సోదరి రీహానా విజ్ఞప్తి!

ప్రముఖ సింగర్ సుజాత మోహన్ గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె గత ఐదేళ్లుగా పాటలు పాడటం లేదని తెలిసింది. అసలు ఎందుకు ఆమె పాటలకు దూరమయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.

సుజాత మోహన్ పాటలకు దూరం కావడానికి కారణం ఇదే!

ప్రముఖ సింగర్ సుజాత మోహన్ కి పరిచయం అవసరం లేదు. ఆమె తన మధురమైన గొంతుతో దాదాపు 20వేలకు పైగా పాటలు పాడి అలరించారు. ఆమె పాటలకు, ఆమె గొంతుకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే.. గత ఐదేళ్లుగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ లకు దూరంగా ఉండటం అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంపై తాజాగా ఆమె ఓ అవార్డు వేదికపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

సుజాత గత ఐదేళ్లుగా తీవ్రమైన గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఆరోగ్య సమస్య కారణంగా ఆమె మునుపటిలా పాడలేకపోయారు. ముఖ్యంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే సమయంలో తన గొంతు సహకరించకపోవడం తో ఆమె స్టేజ్ పర్ఫార్మెన్స్ లకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. ఈ విషయాన్ని చెబుతూ ఆమె వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ ఒక గాయనిగా గొంతు సరిగ్గా లేకపోవడం అనేది ఎంతటి నరకమూ మాటల్లో చెప్పలేను’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20వేలకు పైగా పాటలు పడిన తనకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం.

గొంతు సమస్యతో బాధపడుతున్న సింగర్ సుజాత

కాగా, సమస్య ఉన్నప్పటికీ తాను సంగీతాన్ని విడిచి పెట్టలేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా మళ్లీ తన గొంతును సరిచేసుకోవడానికి నిరంతరం సాధన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మళ్లీ పూర్తి స్థాయిలో పాడతానని చెప్పారు.

మెరుగైన చికిత్స కోసం ఏఆర్ రెహమాన్ సోదరి సహాయం

సుజాత పరిస్థితిని చూసి ఏఆర్ రెహమాన్ సోదరి రీహానా కూడా స్పందించారు. సుజాత గొంతు మళ్లీ మనుపటిలా మారేలా మెరుగైన చికిత్స అందించాలని, ఎవరైనా వైద్యులు దీనికి సహాయం చేయగలిగితే ముందుకు రావాలని ఆమె సోషల్ మీడియా వేదికగా కోరడం విశేషం. కాగా, సుజాత మోహన్ కుమార్తె శ్వేతా మోహన్ కూడా పాపులర్ సింగర్. ఆమె తెలుగు, తమిళ భాషల్లో పాటలు పాడారు.

సుజాత మోహన్ త్వరగా కోలుకొని మళ్లీ తన పాటలతో అలరించాలని మనస్పూర్తిగా కోరుకుందాం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.