|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలా అండగా ఉంటాం: ఉప్పల శ్రీనివాస్ గుప్త

Published: 19-04-2026, 1:05 PM
సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలా అండగా ఉంటాం: ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్ ఫిలింనగర్‌లోని రామా నాయుడు స్టూడియోలో “పార్వతి సినిమాస్” బ్యానర్‌పై రూపొందుతున్న “రెటీనా” (Eyes Never Lie) సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి. పి.సి.సి ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ప్రముఖ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ , దర్శకులు యాట సత్యనారాయణ విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ… తెలంగాణలో సినిమా రంగానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు.

హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమాలు నిలవాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా యువతకు మంచి సందేశం ఇచ్చే చిత్రాలు తీసుకురావాలని సూచించారు. డ్రగ్స్ వంటి చెడు అలవాట్లను ప్రోత్సహించకుండా, సమాజానికి ఉపయోగపడే, ప్రేరణనిచ్చే కథలతో సినిమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.ముగింపులో చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, ప్రేక్షకుల ఆశీర్వాదాలతో “రెటీనా” చిత్రం విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత కమిటీ కుర్రాళ్ళు హీరో యశ్వంత్ , ప్రొడ్యూసర్ పార్వతి , డైరెక్టర్ శ్రీ అల్లం రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవికుమార్ , రెటిన హీరో మనీష్ , హీరోయిన్స్ సోనియా నాయుడు, ప్రీతి హెప్సోన , సీనియర్ నటులు లక్ష్మి పార్వతి , పుష్పా చౌదరి , యోగి ఖత్రి చిత్ర బృందం పాల్గొన్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.