|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

100 కోట్ల క్లబ్‌లోకి `సితారే జమీన్ పర్`.. వంద కోట్లు దాటిన అమీర్‌ ఖాన్‌ చిత్రాల జాబితా

Published: 24-06-2025, 12:50 PM
100 కోట్ల క్లబ్‌లోకి `సితారే జమీన్ పర్`.. వంద కోట్లు దాటిన అమీర్‌ ఖాన్‌ చిత్రాల జాబితా

అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. అమీర్ ఖాన్ నటించిన ఇతర వందకోట్ల చిత్రాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

సితారే జమీన్ పర్ 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

2

అమీర్ ఖాన్ నటించిన 11వ వందకోట్ల చిత్రం ఇది.

4

భారత్‌లో 65.80 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది.

సితారే జమీన్ పర్ బాక్సాఫీస్ విజయం

అమీర్‌ ఖాన్‌ సినిమాలు చాలా ఏళ్ల తర్వాత హిట్‌ టాక్‌ని అందుకుంటున్నాయి. `దంగల్‌` తర్వాత ఆయన్నుంచి సరైన హిట్‌ మూవీ పడలేదు. ఎంతో కష్టపడి చేసిన సినిమాలన్నీ డిజప్పాయింట్‌ చేస్తూ వచ్చాయి.

ఈ క్రమంలో ఇన్నాళ్లకి ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ హిట్‌ టాక్‌ తెచ్చుకుంటుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది. ఈ మూవీ నాలుగు రోజుల నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 105.17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించింది. నెమ్మదిగా పుంజుకుంటూ కలెక్షన్లని పెంచుతుంది. భారీ వసూళ్ల దిశగా వెళ్తుందీ మూవీ.

అమీర్ ఖాన్ వందకోట్ల క్లబ్ చిత్రాలు

బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం, ‘సితారే జమీన్ పర్’ 4 రోజుల్లో భారత్‌లో 65.80 కోట్ల రూపాయల నెట్‌ కలెక్షన్లని వసూలు చేయగా, గ్రాస్‌ కలెక్షన్లు 78.33 కోట్ల రూపాయలు. అదే సమయంలో, అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో 26.84 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇలా మొత్తంగా వంద కోట్లు దాటేసింది.

అమీర్‌ ఖాన్‌ నటించిన  వంద కోట్లు దాటిన మూవీస్‌లో ‘సితారే జమీన్ పర్’ 11వ చిత్రంగా నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద 105 కోట్ల రూపాయల వసూళ్లను దాటింది. ఇంతకు ముందు ఆయన నటించిన 10 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్‌లో చేరాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.

‘సితారే జమీన్ పర్’ కంటే ముందు అమీర్ ఖాన్ 10 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ చిత్రాలు: `దంగల్` (1968.03 కోట్ల రూపాయలు), `సీక్రెట్ సూపర్‌స్టార్` (875.78 కోట్ల రూపాయలు), `పీకే` (769.89 కోట్ల రూపాయలు), `ధూమ్ 3` (556.74 కోట్ల రూపాయలు), `3 ఇడియట్స్` (400.61 కోట్ల రూపాయలు),

ఇతర వందకోట్ల బాలీవుడ్ చిత్రాలు

`థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` (322.07 కోట్ల రూపాయలు), `గజినీ` (189.19 కోట్ల రూపాయలు), `తలాష్` (180.83 కోట్ల రూపాయలు), `లాల్ సింగ్ చద్దా` (129.64 కోట్ల రూపాయలు), `ఫనా` (102.84 కోట్ల రూపాయలు) వంటి చిత్రాలున్నాయి.

2025లో ‘సితారే జమీన్ పర్’ కంటే ముందు 7 బాలీవుడ్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ చిత్రాలు: `ఛావా` (797.34 కోట్ల రూపాయలు), `రైడ్‌ 2` (243.06 కోట్ల రూపాయలు),

`హౌస్‌ఫుల్ 5 `(252.94 కోట్ల రూపాయలు), `స్కై ఫోర్స్` (168.88 కోట్ల రూపాయలు), `సికిందర్` (176.18 కోట్ల రూపాయలు), `కేసరి చాప్టర్ 2` (144.35 కోట్ల రూపాయలు), `జాట్` (119.24 కోట్ల రూపాయలు).

మొత్తంమీద, సితారే జమీన్ పర్ అమీర్ ఖాన్ కెరీర్ లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం ఆయనకు మరో మైలురాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.