|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అనసూయ నాకు తెలీదు! నాపై ఫిర్యాదు చేసింది వాళ్లే.. శివాజీ సంచలన కామెంట్స్ వైరల్!

Published: 23-02-2026, 10:35 AM
షాకింగ్: అనసూయ నాకు తెలీదు! నాపై ఫిర్యాదు చేసింది వాళ్లే.. శివాజీ సంచలన కామెంట్స్ వైరల్!
  • శివాజీ సంచలన వ్యాఖ్యలు: అనసూయతో పరిచయం లేదని స్పష్టీకరణ!
  • మహిళా కమిషన్ ఫిర్యాదుపై శివాజీ ఆవేదన: తెలిసినవాళ్లే కంప్లైంట్ చేశారంటూ వాఖ్యలు!
  • సినిమా ఈవెంట్‌లో అసభ్యకర పదాల వివాదం: క్షమాపణ చెప్పినా ఆగని దుమారం!
  • అనసూయ విమర్శలపై శివాజీ కౌంటర్ ఎటాక్: పాత ఇంటర్వ్యూ తప్ప వ్యక్తిగతంగా పరిచయం లేదంటూ క్లారిటీ!

టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అనసూయతో పరిచయం లేదని, తనపై కావాలనే ఫిర్యాదు చేశారని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైందో తెలుసుకుందాం.

అసలేం జరిగింది? శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు!

Sivaji : ఇటీవల కొన్ని రోజుల క్రితం శివాజీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓ సినిమా ఈవెంట్ లో హీరోయిన్స్ మంచిగా బట్టలు వేసుకోండి బయటకు వెళ్తే అని చెప్తూ అనుకోకుండా ఓ రెండు అసభ్యకరమైన పదాలు వాడటంతో అది పెద్ద వివాదంగా మారింది. సామాన్యులు, చాలా మంది సెలబ్రిటీలు శివాజీ అనుకోకుండా రెండు పదాలు మాట్లాడినా మంచే కదా చెప్పింది అని సపోర్ట్ చేసినా కొంతమంది మాత్రం శివాజీపై తీవ్ర విమర్శలు చేశారు.(Sivaji)

కొంతమంది అయితే శివాజీపై మహిళా కమిషన్ కి కూడా ఫిర్యాదు చేశారు. ఆ వివాదంలోకి అనసూయ కూడా ఎంటర్ అయింది. అనసూయ కూడా శివాజీపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు ఆ వివాదం అయిపోయినా శివాజీ ఎక్కడ కనిపించినా మొదట ఇదే ప్రశ్న ఎదురవుతుంది. కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇంకా ఈ వివాదాన్ని లాగుతున్నారు.

అనసూయ వర్సెస్ శివాజీ: మాటల యుద్ధం!

తాజాగా శివాజీకి ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రశ్నలు ఎదురయి అనసూయ గురించి కూడా ప్రస్తావించడంతో శివాజీ మాట్లాడుతూ.. అనుకోకుండా రెండు పదాలు వాడాను. దానికి నేను అప్పుడే క్షమాపణలు కూడా చెప్పాను. ఇంకా లాగొద్దు దాన్ని. నాకు అనసూయ పరిచయం కూడా లేదు. ఆమె ఎప్పుడో గతంలో నాతో ఒక ఇంటర్వ్యూ చేసింది అంతే. అది తప్ప నాకు ఆమెకు ప్రత్యక్షంగా కూడా పరిచయం లేదు. ఎవరూ కావాలని ఆడవాళ్ళని కించపరచాలని, అవమానపరచాలని అనుకోరు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.

మహిళా కమిషన్ ఫిర్యాదు: శివాజీ రియాక్షన్!

వుమెన్ కమిషన్ లో నాకు తెలిసినవాళ్ళే నా మీద కంప్లైంట్ చేశారు. అయినా ఆ విషయం ఇంకా మాట్లాడొద్దు అది అయిపొయింది అని అన్నారు. దీంతో శివాజీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై మళ్ళీ అనసూయ ఏమైనా స్పందిస్తుందా చూడాలి.

శివాజీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివాదంపై అనసూయ ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.