|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీ వివాదం: ‘ఆ రెండు పదాలే తప్ప’.. సెలబ్రిటీల విమర్శలు, నెటిజన్ల తిరుగుబాటు!

Published: 27-12-2025, 7:33 AM
శివాజీ వివాదం: 'ఆ రెండు పదాలే తప్ప'.. సెలబ్రిటీల విమర్శలు, నెటిజన్ల తిరుగుబాటు!
  • శివాజీ దండోరా ఈవెంట్‌లో అభ్యంతరకర పదాలు వాడటంతో పెద్ద వివాదం చెలరేగింది.
  • సెలబ్రిటీలు విమర్శిస్తున్నా, ‘రెండు పదాలే తప్పు, విషయం మంచిదే’ అంటూ సోషల్ మీడియా శివాజీకి మద్దతు.
  • అనసూయ, నాగబాబు, చిన్మయి వంటి సెలబ్రిటీలు శివాజీపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు.
  • గతంలో సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి నెటిజన్లు ఎదురుదాడి చేస్తున్నారు.

శివాజీ దండోరా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వివాదాన్ని సృష్టించాయి. రెండు అసభ్యకరమైన పదాల వాడకంపై సెలబ్రిటీలు విమర్శిస్తున్నా, సోషల్ మీడియా, నెటిజన్లు మాత్రం శివాజీకి బలంగా మద్దతు తెలుపుతున్నారు. ఇది సెలబ్రిటీలు వర్సెస్ నెటిజన్ల యుద్ధంగా మారింది.

శివాజీ వ్యాఖ్యలు: వివాదానికి దారి

Sivaji Issue : ఇటీవల శివాజీ దండోరా సినిమా ఈవెంట్లో అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోండి, హీరోయిన్స్ చక్కగా చీరలు కట్టుకోండి అని చెప్తూ పొరపాటున రెండు అసభ్యకరమైన పదాలు వాడారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. కొంతమంది సెలబ్రిటీలు శివాజీపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో సోషల్ మీడియా, జనాలు అంతా శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు.

కొంతమంది హీరోయిన్స్ ఈవెంట్స్ కి, బయట తమ శరీరభాగాలన్నీ కనపడేలా వేసుకొచ్చే డ్రెసులను ఉద్దేశించి శివాజీ ఆ వ్యాఖ్యలు చేసారు. దీంతో శివాజీ చెప్పింది వంద శాతం కరెక్ట్, కేవలం ఒక రెండు పదాలు తప్పు మాట్లాడారు. ఆ పదాలు తప్పుగా వాడినా ఆయన చెప్పిన విషయం మాత్రం మంచిదే, ఇంట్లో అమ్మానాన్నలు మంచి మాటలు చెప్పరా అంటూ సోషల్ మీడియాలో, బయట జనాలు శివాజీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు.

Sivaji : నా మీద కుట్ర చేస్తున్నారు.. శివాజీ సంచలనం.. నాగబాబు వ్యాఖ్యలపై..

సెలబ్రిటీలు వర్సెస్ సోషల్ మీడియా

అయితే అనసూయ, నాగబాబు, చిన్మయి, ఝాన్సీ.. మరికొంతమంది నటీనటులు బహిరంగంగానే శివాజీని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వాళ్ళు గతంలో చేసిన కామెంట్స్, సినిమాల్లో, షోలలో వాళ్ళు మాట్లాడిన అసభ్యకరమైన పదాలు బయటకు తీసి మీరు చేస్తే కరెక్టా అని ప్రశిస్తున్నారు. అంతే కాకుండా ఇంత కన్నా నీచంగా మహిళల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమి అనరా అంటూ ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం శివాజీ మాట్లాడింది తప్పు అంటున్నారు.

అయితే శివాజీ ఇప్పటికే నా మాటలకు కట్టుబడే ఉన్నాను, నేను మంచి చెప్పాను, కానీ రెండు పదాలు తప్పుగా మాట్లాడాను అందుకు క్షమాపణలు, మంచి చెప్పకూడదు అని అర్థమైంది అని చెప్పాడు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు కావాలని తనపై కుట్ర చేస్తున్నారని మీడియా ముందు మాట్లాడాడు శివాజీ. ఈ వివాదం ఇక్కడితో ఆపేద్దాం అంటూ తన మాటలకు ఎవరైనా హర్ట్ అయితే క్షమాపణలు అని కూడా చెప్పాడు శివాజీ.

శివాజీ క్షమాపణ, కుట్ర ఆరోపణలు

కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం శివాజీపై ఇంకా కామెంట్స్ చేస్తున్నారు. ఆ సెలబ్రిటీలకు నెటిజన్లు వారి పోస్టుల కిందే శివాజీకి సపోర్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ, చిన్మయి పెట్టిన అన్ని పోస్టులకు శివాజీ వంద శాతం రైట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహిళలు కూడా కొంతమంది శివాజీ కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శివాజీ ఇష్యూ సెలబ్రిటీలు వర్సెస్ నెటిజన్లుగా మారింది.

మొత్తం మీద శివాజీ వివాదం ఇంకా చల్లారలేదు. ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడినప్పటికీ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా సెలబ్రిటీలు విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మద్దతు శివాజీకి ఒక బలంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.