|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీ రాజా ఇంట తీరని విషాదం! తండ్రి మరణంతో శోకసంద్రంలో నటుడు!

Published: 03-03-2026, 2:37 AM
శివాజీ రాజా ఇంట తీరని విషాదం! తండ్రి మరణంతో శోకసంద్రంలో నటుడు!
  • ప్రముఖ నటుడు శివాజీ రాజా తండ్రి బి. రామరాజు మృతి చెందారు.
  • రామరాజు వయోభారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.
  • మంగళవారం ఉదయం మధురానగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
  • జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రముఖ నటుడు శివాజీ రాజా గారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి బి. రామరాజు గారు వయోభారంతో కన్నుమూశారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

శివాజీ రాజా తండ్రి మృతి

Sivaji Raja : టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. ఆయన కన్న తండ్రి బి. రామరాజు మరణించారు.. ఈయనకు వయసు పై పడటంతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండటంతో ఆయన తుది శ్వాస విడిచారు. మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మరణంతో నటుడు శివాజీ రాజా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.. తన తండ్రి చనిపోయారని తెలుసుకున్న పలువురు సినీ నటులు స్నేహితులు ఆయనకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు సన్నిహితులు ఆయన స్వగృహానికి చేరుకొని పరామర్శించారు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తుంది. సినీ అభిమానులు శివాజీ రాజా కుటుంబానికి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు..

అనారోగ్యంతో కన్నుమూత

రేపు అంత్యక్రియలు

శివాజీ రాజా గారి తండ్రి మరణం టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.