|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివకార్తికేయన్‌తో ఇద్దరు ట్రెండింగ్‌ హీరోయిన్స్‌..

Published: 09-06-2025, 12:46 AM
శివకార్తికేయన్‌తో ఇద్దరు ట్రెండింగ్‌ హీరోయిన్స్‌..

వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ తాజా చిత్రం గురించి చర్చ జరుగుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇద్దరు ట్రెండింగ్ హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం.

Key Points

1

శివకార్తికేయన్ తాజా చిత్రంలో కాయాదు లోహర్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు.

2

వెంకట్ ప్రభు దర్శకత్వంలో టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

4

అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

శివకార్తికేయన్ తాజా ప్రాజెక్ట్

వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్‌(Sivakarthikeyan).. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన అమరన్‌ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న శివకార్తికేయన్‌ ప్రస్తుతం ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో మదరాశి, అదే విధంగా సుధాకొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలే. వీటిలో పరాశక్తి చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతుందని సమాచారం. రవిమోహన్‌ ప్రతి నాయకుడిగా వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ శ్రీలీల కథానాయక కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.

టైమ్ ట్రావెలింగ్ కథాంశం

శివకార్తికేయన్‌ తాజాగా మరో చిత్రానికి పచ్చ జెండా ఊపారు. ఈయన వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని గురించి ఇంతకుముందే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది టైమ్‌ ట్రావెలింగ్‌ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. లేకపోతే ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నట్లు తెలిసింది. అందులో ఒకరు క్రేజీ నటి కాయాదు లోహర్ కాగా, మరొకరు కల్యాణి ప్రియదర్శన్‌ అని సమాచారం.

హీరోయిన్లు ఎవరు?

కాగా కల్యాణి ప్రియదర్శన్‌(Kalyani Priyadarshan) ఇంతకుముందే శివకార్తికేయన్‌కు జంటగా హీరో (శక్తి) చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఆమె తెలుగులో ‘చిత్రలహరి, హలో’ వంటి సినిమాలతో మెప్పించారు. మరోవైపు కాయాదు లోహర్(Kayadu Lohar) పేరు డ్రాగన్‌ సినిమాతో తెలుగు, తమిళ్‌లో   బాగా పాపులర్‌ అయిపోయిన విషయం తెలిసిందే. కాగా శివకార్తికేయన్‌ వెంకట్‌ ప్రభు కాంబోలో తెరకెక్కనున్న చిత్రం అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

శివకార్తికేయన్ మరియు వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.