|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SKN: కేతిక శర్మతో చిట్‌ చాట్‌.. నిర్మాత ఎస్‌కేఎన్‌ అసభ్యకర కామెంట్స్!

Published: 15-05-2025, 9:20 AM
SKN: కేతిక శర్మతో చిట్‌ చాట్‌.. నిర్మాత ఎస్‌కేఎన్‌ అసభ్యకర కామెంట్స్!

శ్రీ విష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్ నిర్మాత ఎస్‌కేఎన్‌తో చిట్‌ చాట్‌ నిర్వహించింది. కానీ, ఆ ఇంటర్వ్యూలో ఎస్‌కేఎన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Key Points

1

సినిమా 'సింగిల్' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది.

2

నిర్మాత ఎస్‌కేఎన్‌, 'సింగిల్' టీమ్‌తో చిట్‌ చాట్‌ నిర్వహించారు.

4

ఎస్‌కేఎన్‌ ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

‘సింగిల్’ సినిమా సక్సెస్

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింగిల్’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన  నాలుగు రోజుల్లో రూ.19.01 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

ఎస్‌కేఎన్‌తో చిట్‌ చాట్‌

ఈ నేపథ్యంలోనే సింగిల్ మూవీ టీమ్‌ సరదాగా ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్‌తో చిట్ చాట్‌ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూకు హీరో శ్రీ విష్ణుతో పాటు వెన్నెల కిశోర్, కేతిక శర్మ, ఇవానా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో నిర్మాత ఎస్‌కేఎన్‌ సరదా ప్రశ్నలు వేస్తూ నవ్వించారు. అంతవరకే బాగానే ఉన్నా హీరోయిన్‌ కేతిక శర్మను అడిగిన ప్రశ్న మాత్రం కాస్తా ఇబ్బందిపడేలా చేయడం మాత్రమే కాదు.. అభ్యంతరకరంగా అనిపించింది. అదేంటో మీరు కూడా చూసేయండి.

అసభ్యకర కామెంట్స్‌పై విమర్శలు

ఇంటర్వ్యూ మధ్యలో నిర్మాత ఎస్‌కేఎన్‌.. హీరోయిన్‌ కేతిక శర్మను ఓ ఊహించని ప్రశ్న అడిగారు. అప్పుడప్పుడు ప్రభాస్‌ ఇంటర్వ్యూస్ చూశాం.. మీరు బాత్‌రూమ్ సింగర్ అని తెలిసింది.. మీ బాత్‌రూమ్‌కు ఎలాగో మాకు యాక్సెస్‌ ఉండదు కాబట్టి.. ఇక్కడే ఓ పాట పాడండి.. మేము హ్యాపీగా ఫీలవుతాం.. అంటూ కేతిక శర్మను అడిగారు. అయితే హీరోయిన్‌ను పాట పాడమని అడగడం బాగుంది కానీ.. బాత్‌రూమ్‌కు మాకు యాక్సెస్‌ ఉండదు అని అనడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్‌ కాదని అంటున్నారు. అలా అడిగేముందు కాస్తా ఆలోచించాలని ఎస్‌కేఎన్‌కు నెటిజన్స్‌ సలహాలు ఇస్తున్నారు.

నిర్మాత ఎస్‌కేఎన్‌ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఇలాంటి ప్రవర్తన సరైనది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.