
📌 Key Points
- ఫోన్ స్క్రీన్ బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని ఆలస్యం చేస్తుంది
- నిద్ర నాణ్యత తగ్గి అలసట, ఏకాగ్రత లోపం వస్తుంది
- రాత్రి 30-60 నిమిషాల ముందు ఫోన్ వాడకం మానేయాలి
- ఫోన్‌ను బెడ్‌కు దూరంగా టేబుల్ మీద ఉంచాలి
ప్రస్తుతం ఫోన్ వాడకం జీవితంలో భాగమైపోయింది. అయితే ఫోన్ పక్కనే పెట్టుకొని నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లూ లైట్ వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.
ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోవడం వల్ల సమస్యలు
ప్రస్తుతం ఫోన్ వాడటమనేది జీవితంలో ఒక భాగమైపోయింది. మనుషుల మధ్య గ్రేట్ కమ్యూనికేటర్‌గా ఇది నిలుస్తోంది. అదే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ఉపయోగించే విధానం, సమయం వంటివి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అలాంటి వాటిలో ఫోన్ పక్కనే పెట్టుకొని నిద్రపోవడం కూడా ఒకటి. ఇలా చేయడం మీ ఆరోగ్యాన్ని రిస్కులో పడేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏయే సమస్యలకు దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
హార్మోన్ ఉత్పత్తిలో ఆలస్యం..
బ్లూ లైట్ హార్మోన్లపై ప్రభావం
ప్రతీ రాత్రి ఫోన్‌ను పక్కనే పెట్టుకొని నిద్రపోవడం, అలాగే రాత్రిళ్లు నిద్రపోకుండా స్క్రోల్ చేయడం ఇటీవల అనేక మందిలో సాధారణ అలవాటుగా మారిపోతోంది. కానీ ఇది మీ స్లీప్ క్వాలిటీపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ఈ సందర్భంలో ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ మీ శరీరంలో మెటలోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని ఆలస్యం చేస్తుంది. దీనివల్ల నిద్ర రావడం కష్టమవుతుంది. ఒకవేళ వచ్చినా నాణ్యమైన నిద్ర తగ్గుతుంది. అంతేకాకుండా లేట్‌నైట్ స్క్రోలింగ్, నోటిఫికేషన్లు, ఆసక్తికరమైన కంటెంట్ వల్ల మెదడు ఉత్తేజిత అవస్థలో ఉంటుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్ అవ్వకుండా చేసి, నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. దీని వల్ల మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం, శక్తి హీనత వంటి సమస్యలు ఎదురవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
30 నిమిషాల ముందు ఇలా చేయండి..
నిద్ర మెరుగుపరచడానికి చిట్కాలు
అయితే ఫోన్ మీ ఏకాగ్రతను, అలసటను, నిద్రను దెబ్బతీయకుండా ఉండాలంటే మీరు ఉపయోగించే విధానం మారాలని సాంకేతిక, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయానికి 30 నుంచి 60 నిమిషాల ముందు ఫోన్ వాడటం మానేయాలి. అలాగే నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను మీ బెడ్‌పైన దగ్గరగా ఉంచి పడుకోవడం కూడా రిస్కే కాబట్టి దూరంగా టేబుల్ మీద ఉంచడం శ్రేయస్కరం. ఈ చిన్న చిన్న మార్పులే మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని, రోజంతా ఉత్సాహంగా, ఏకాగ్రతతో ఉండడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఫోన్‌ను దూరంగా ఉంచి నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. చిన్న మార్పులే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


