
థియేటర్లలో సంచలనం సృష్టించిన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే ప్రభంజనం కొనసాగిస్తోంది. ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ కేవలం 4 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను దాటి రికార్డు సృష్టించింది. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Key Points
లిటిల్ హార్ట్స్ ఓటీటీలో 4 రోజుల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటింది.
ఈటీవీ విన్ లో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ కామెడీ.
మౌళి తనూజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రలు, సాయి మార్తాండ్ దర్శకత్వం.
రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూ.40 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఓటీటీలో లిటిల్ హార్ట్స్ ప్రభంజనం
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ ఇప్పుడు ఓటీటీని కూడా షేక్ చేస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఓటీటీలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది.
లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీలో 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇవాళ (అక్టోబర్ 4) సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది.
‘‘థియేటర్లలో సెన్సేషన్ నుంచి ఓటీటీలో సూపర్ సెలబ్రేషన్. ఈటీవీ విన్ లో లిటిల్ హార్ట్స్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసింది’’ అని ఈటీవీ విన్ పోస్టు చేసింది.
సినిమా కథాంశం, నటీనటుల వివరాలు
బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ అక్టోబర్ 1 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన సంస్థ ఈటీవీ విన్ ఓటీటీలోనే సినిమా రిలీజైంది. థియేటర్లో రిలీజైన సినిమాకు మరికొంత భాగం యాడ్ చేసి ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇందులో మౌళి తనూజ్, శివానీ నాగారం హీరో హీరోయిన్లు.
సెప్టెంబర్ 5, 2025న థియేటర్లో విడుదలైంది లిటిల్ హార్ట్స్. మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్లు కుమ్మేసింది. రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంచనా. లిటిల్ హార్ట్స్ లో మౌళి తనూజ్, శివానీ నగరం, రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య, నిఖిల్ తదితరులు నటించారు. దీనికి సాయి మార్తాండ్ డైరెక్టర్.
చదువులో అంతంతమాత్రంగానే ఉండే అఖిల్ (మౌళి తనూజ్)కు ఎంసెట్ లో ర్యాంకు రాదు. పేమెంట్ సీట్ తో ఇంజినీరింగ్ కాలేజీలో చేరాలనుకుంటాడు. కానీ ఫాదర్ గోపాలరావు (రాజీవ్ కనకాల) తన కొడుకును ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపిస్తాడు. మరోవైపు హీరోయిన్ కాత్యాయని (శివానీ నాగారం) పేరేంట్స్ డాక్టర్లు. వాళ్లు తమ కూతుర్ని డాక్టర్ ను చేయాలని ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపిస్తారు. అక్కడ అఖిల్, కాత్యాయని మధ్య పరిచయం కలుగుతుంది.
లిటిల్ హార్ట్స్: థియేటర్ల నుంచి ఓటీటీకి
కాత్యాయనికి ప్రపోజ్ చేస్తాడు అఖిల్. కానీ అప్పుడు కాత్యాయని ఓ విషయాన్ని బయటపెడుతుంది. దీంతో లవ్ స్టోరీ కథ మలుపు తిరుగుతుంది. మరి కాత్యాయని చెప్పిన విషయం ఏంటీ? వీళ్ల ప్రేమ విజయవంతమైందా?అన్నదే మిగతా కథ.
ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా లేనప్పుడు, స్వచ్ఛమైన బాల్యం, టీనేజీని గడిపిన రోజులకు లిటిల్ హార్ట్స్ మనల్ని తీసుకెళ్తుంది. ఈ వారం మంచి రొమాంటిక్ కామెడీ చూడాలనుకే ఓటీటీ ఆడియన్స్ కు లిటిల్ హార్ట్స్ మంచి ఆప్షన్.
థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ‘లిటిల్ హార్ట్స్’ సాధించిన ఈ అద్భుత విజయం, కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలైనా పెద్ద ప్రభావాన్ని చూపగలవని నిరూపించింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది.


