
టాలీవుడ్‌లో తక్కువ సినిమాలు చేసినప్పటికీ, అందాలతో అలరించే శోభిత ధూళిపాళ, అక్కినేని నాగచైతన్య భార్య. తాజాగా ఆమె చీరకట్టులో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని పచ్చని ప్రకృతిలో దిగిన ఈ ఫోటోలు ఆమె అందాలను మరింతగా చాటుతున్నాయి.
Key Points
శోభిత ధూళిపాళ తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తోంది.
చీరకట్టులో అందంగా కనిపించిన శోభిత ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తమిళనాడులోని పచ్చని పొలాల మధ్య ఫోటోషూట్ చేసింది.
అక్కినేని నాగచైతన్య భార్యగా శోభిత ప్రసిద్ధి చెందింది.
శోభిత ధూళిపాళ వైరల్ ఫోటోలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. కొంతమంది మాత్రమే ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో.. అక్కినేని కోడలు, హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ఒకరు. తెలుగులో తక్కువ సినిమాలు చేసిన ఈ బ్యూటీ… అక్కినేని కోడలు పోస్ట్ కొట్టేసింది. హీరోయిన్ సమంత (Samantha) అలాగే అక్కినేని నాగచైతన్య ( Naga chaitanya) విడాకులు తీసుకున్న నేపథ్యంలో… శోభిత కు అక్కినేని కోడలు పోస్ట్ వచ్చింది.
గత సంవత్సరం చివరలో అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది శోభిత దూళిపాళ్ల. విశాఖకు చెందిన ఈ అందాల తార.. మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. అక్కడ విఫలం కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది.
చీరలో అందంగా కనిపించిన శోభిత
పెళ్లి అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న శోభిత… సోషల్ మీడియాలో మాత్రం అందచందాలను ఆరబోస్తోంది. ఇటీవల తమిళనాడుకు వెళ్లి పచ్చడి పొలాల మధ్య ఫోటోలు దిగిన శోభిత.. తాజాగా చీరకట్టులో కనిపించింది. ఈ సందర్భంగా.. అదిరిపోయే ఫోజులిస్తూ… రచ్చ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తమిళనాడులోని ఫోటోషూట్
A post shared by Sobhita Dhulipala (@sobhitad)
చివరగా, శోభిత ధూళిపాళ తన అందాలతో అభిమానులను మెప్పిస్తూనే ఉంది. ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఆమె ప్రజాదరణను చాటుతుంది.


