
నాగ చైతన్య తన కెరీర్‌లో వంద కోట్లు వసూలు చేసిన ‘తండేల్’ సినిమాలోని ‘బుజ్జితల్లి’ పాట గురించి ఆసక్తికర విషయం పంచుకున్నారు. ఈ పాట వల్ల తన భార్య శోభిత ధూళిపాళ అలిగిన సంగతిని ఆయన వెల్లడించారు. భార్యాభర్తల బంధంపై కూడా చైతన్య తన అభిప్రాయాలను తెలిపారు.
Key Points
‘బుజ్జితల్లి’ పాట వల్ల శోభిత కొన్నాళ్లు నాగ చైతన్యతో మాట్లాడలేదట.
శోభితను ముద్దుగా ‘బుజ్జితల్లి’ అని పిలవడం వల్లే ఆమెకు అభ్యంతరం వచ్చిందని చైతన్య తెలిపారు.
‘తండేల్’ చిత్రం నాగ చైతన్య కెరీర్‌లో రూ. 100 కోట్లు వసూలు చేసి పెద్ద హిట్ అయింది.
నిజమైన బంధాలలో చిన్న గొడవలు సహజమని నాగ చైతన్య అభిప్రాయపడ్డారు.
శోభిత అలిగిన ‘బుజ్జితల్లి’ పాట వెనుక కథ
నాగ చైతన్య(Naga Chaitanya) కెరీర్‌లో అత్యధిక వసూళ్ల(రూ. 100 కోట్లు)ను సాధించిన చిత్రం ‘తండేల్’. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రిలీజైన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ విజయంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బుల్లితల్లి పాట రిలీజ్‌కి ముందే సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మొన్నటి వరకు ఏ ఈవెంట్‌లో చూసినా ఈ పాట వినిపించేంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఈ పాట గురించే ఎక్కువగా చర్చించారు. అంత సూపర్ హిట్‌గా నిలిచిన ఈ పాట.. నాగ చైతన్యకు మాత్రం కాస్త ఇబ్బందినే కలిగించిందట.
ఈ పాట కారణంగా తన సతీమణి శోభిత(sobhita dhulipala) కొన్నాళ్లపాటు మాట కూడా మాట్లాడలేదట. ఈ విషయాన్ని స్వయంగా నాగ చైతన్యనే చెప్పారు. తాజాగా ఆయన జగపతి బాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘బుజ్జితల్లి’ పాట వెనుక జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకున్నాడు.
నాగ చైతన్య కెరీర్‌లో ‘తండేల్’ విజయం
‘ శోభితను నేను ముద్దుగా బుజ్జితల్లి అని పిలుస్తాను. అయితే ఈ పేరునే తండేల్‌లో చిత్రంలో సాయి పల్లవికి పెట్టడం.. బుజ్జితల్లిపై పాట కూడా రావడంతో శోభిత అప్ సెట్ అయింది . కోపంతో కొన్నాళ్ల పాటు నాతో మాట్లాడలేదు . ఆ పేరుని నేనే దర్శకుడికి సూచించానని ఆమె అనుకుంది . కానీ నేనెందుకు అలా చేస్తా ? అని నవ్వుతూ చెప్పాడు చైతన్య . ఇక భార్య భర్తల సంబంధం గురించి మాట్లాడుతూ .. ‘ ఈ ప్రపంచంలో గొడవ పడని జంటలు ఉండవు . ఇద్దరి మధ్య గొడవే జరగలేదంటే .. వారి రిలేషన్ షిప్ నిజమైనది కాదని అర్థం ’ అని చెప్పుకొచ్చాడు .
భార్యాభర్తల బంధంపై చైతన్య అభిప్రాయాలు
నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడు . నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది .
మొత్తం మీద, నాగ చైతన్య తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పంచుకున్న ఈ సంఘటన అభిమానులను ఆకట్టుకుంది. తండేల్ విజయం, శోభితతో సరదా అలుక, భవిష్యత్ ప్రాజెక్ట్‌లు అన్నీ వార్తల్లో నిలిచాయి.


