|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూంలు కడిగా: ‘జబర్దస్త్‌’ కొమురక్క

Published: 19-10-2025, 4:15 AM
కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూంలు కడిగా: ‘జబర్దస్త్‌’ కొమురక్క

జబర్దస్త్ నటుడు కొమురక్క సినీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. కోటిలో బ్యాగులు అమ్మి, బాత్రూంలు కడిగి, ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు. కమెడియన్ కుమార్‌ అలియాస్ ‌ కొమురక్క తన జీవితంలోని కీలక మలుపులను, విజయ రహస్యాలను పంచుకున్నారు.

Key Points

1

నటుడు కుమార్‌ అలియాస్ ‌ ‘ జబర్దస్త్‌ ‌’ కొమురక్క కష్టాలు ఎన్నో ఉన్నా విజయం సాధించారు.

2

ఒకప్పుడు హోటల్ ‌ లో పనిచేస్తూ బాత్రూంలు కడిగాడు, ఇది ఆయన ప్రస్థానంలో ఒక భాగం.

4

సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో భార్య నెలకు రూ .3000 పంపి అండగా నిలిచింది.

“పనే నాకు దేవుడు”: కొమురక్క కష్టాల ప్రస్థానం

‘ పనే నాకు దేవుడు. మనం చేసే పనే డబ్బుతో పాటు గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతుంది. నిజాయితీగా పని చేసేవాడికే దేవుడు సక్సెస్ ‌ ఇస్తాడని నేను నమ్ముతాను ’ అంటున్నాడు నటుడు కుమార్‌ అలియాస్ ‌ ‘ జబర్దస్త్‌ ‌’ కొమురక్క . లేడీ గెటప్ ‌ తో అందరిని అలరిస్తున్న కొమురం .. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి చాలానే కష్టపడ్డాడు . ఒకప్పుడు హోటల్ ‌ లో పని చేయడమే కాదు .. బాత్రూంలు కడిగాడట . వచ్చిన ప్రతీ రూపాయిని భూమిపై ఇన్వెస్ట్ ‌ చేయడంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటున్నాడు ఈ కమెడియన్ ‌. తాజాగా ఓ యూట్యూబ్ ‌ చానల్ ‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ‌ ప్రారంభంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు .

కోటిలో బ్యాగులు అమ్ముకున్నా .. పదో తరగతి అయిపోగానే నేను హైదరాబాద్ ‌ కి వచ్చాను . డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు . హోటల్ ‌ లో పని చేశాను . కిరాణం దుకాణం పెట్టి స్టాఫ్ ‌ కి ఉద్దెర ఇచ్చేవాడిని . హోటల్ ‌ లో పని అయిపోగానే కోటిలో ఎఫ్ ‌ ఎమ్ ‌ రేడీయోలు , బ్యాగులు అమ్ముకునేవాడిని . వర్షాకాలం వస్తే గొడుగులు , పర్సులు అమ్ముకునేవాడిని . అలా ఎమిమిదేళ్ల పాటు కష్టపడి పని చేశాను . ఒకవైపు హోటల్ ‌ లో పని .. కిరాణ దుకాణం .. గ్యాప్ ‌ లో కోటిలో బ్యాగులు అమ్ముకోవడం .. ఇలా రెస్ట్ ‌ లేకుండా పని చేసేవాడిని . ఫ్యామిలీని వదిలి హైదరాబాద్ ‌ కు వచ్చిందే డబ్బుల కోసం . అందుకే నేను ఖాళీగా ఉండేవాడిని కాదు .

హమాలీగా, బాత్రూంలు కడిగిన రోజులు: జీతం రూ.4500

రూ .4500 జీతం .. బాత్రూంలు కడిగా .. హైదరాబాద్ ‌ లో ఎనిమిదేళ్లు పని చేసిన తర్వాత తిరిగి సొంతూరు(షాద్‌నగర్‌)కు వచ్చేశా . పెళ్లి తర్వాత ఓ కంపెనీలో హమాలీ పనికి చేరాను . అప్పుడు నా జీతం రూ . 4500 మాత్రమే . హమాలీ పనితో పాటు అక్కడ బాత్రూంలు కూడా కడిగేవాడిని . అందరూ నన్ను హేళన చేసిన పట్టించుకునేవాడిని కాదు . ఏ పని చేసినా నిజాయితీగా చేయడమే నా లక్ష్యం . బాబు పుట్టిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు హమాలీ పని చేశాడు .

సినిమాల కోసం ప్రయత్నాలు ఓ రోజు నా భార్య ‘ ఎన్నాళ్లు ఇలా దమ్ములో పని చేస్తావ్ ‌?, నీకు సినిమాలు అంటే ఇష్టం కదా .. ఆ ప్రయత్నాలు చెయ్ ‌. బాబుని నేను చూసుకుంటా ’ అని చెప్పింది . మూడేళ్ల పాటు సినిమా ప్రయత్నాలు చెయ్ ‌.. అప్పటికీ సక్సెస్ ‌ కాకపోతే తిరిగి వచ్చేసి ఏదైనా పని చేసుకుందాం ’ అని ఆమె చెప్పింది . నేను ఐదేళ్ల పాటు చాన్స్ ‌ ల కోసం తిరిగాను . ఆ సమయంలో నా భార్యే నాకు నెలకు రూ . 3000 పంపించేది . కుట్టు మిషన్ ‌ కుడుతూ పిల్లాడిని పెంచింది . బంధువులంతా నానా మాటలు అనేవాళ్లు . సినిమా ఇండస్ట్రీపై చెడుగా చెప్పేవారు . నా భార్య మాత్రం అవేవి పట్టించుకునేది కాదు .

సినిమా ప్రయత్నాలకు భార్య అండదండలు

కొమురక్క పాత్ర అలా పుట్టింది ఓసారి ఓ న్యూస్ ‌ చానల్ ‌ కి నేనే ఓ కొత్త ప్రోగ్రాం ఐడియా ఇచ్చాను . ఓ లేడీ ఉంటుందని , ఇలా మాట్లాడుతుందని చెప్పి ఓ గెటప్ ‌ ని నాకు నేనే క్రియేట్ ‌ చేసుకున్నా . ఆ పాత్రకు ముందుగా పోచమ్మ అని పేరు పెట్టుకున్నాను . కానీ అప్పటి ఆంథోల్ ‌ ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతి కుమార్ ‌ ‘ కొమురమ్మ ’ అని పెట్టు అని సలహా ఇచ్చాడు . ఆయన తల్లిగారి పేరు అది . నేను గెటప్ ‌ వేస్తే తన తల్లిలాగే అనిపించిందని .. ఆ పేరు పెట్టుకోమని చెప్పాడు . నేను అమ్మ అని పెడితే ఏది పడితే అది మాట్లాడలేమని చెప్పి ‘ కొమురక్క ’ అని పెట్టుకున్నాను . అప్పటి నుంచి అది ఫేమస్ ‌ అయిపోయింది . జబర్దస్త్ ‌ లో ‘ పశువులు అంటే ప్రాణం ’ అంటూ నేను చేసిన ఓ కామెడీ ఎపిసోడ్ ‌ బాగా వైరల్ ‌ కావడంతో ‘ కొమురక్క ’ పేరు అందరికి తెలిసింది .

ప్రతిపైసా భూమిపై పెట్టా .. ఒకప్పుడు మాకు షాద్ ‌ నగర్ ‌ లో 20 ఎకరాల వరకు భూమి ఉండేది . మా నాన్న అమ్ముకుంటూ వచ్చి చివరకు 5 ఎకరాలకు తీసుకొచ్చాడు . అప్పటి నుంచే నాకు భూమి కొనాలనే ఆశ ఉండేది . నేను , నా భార్య సంపాదించిన ప్రతి పైసా భూమిపై పెట్టా . నాకు ఏ చెడు అలవాట్లు లేవు . అప్పట్లో చాలా తక్కువ ధరకు భూమిని కొన్నాను . ఇప్పుడు దాని విలువ పెరిగింది . నా చుట్టుపక్కల వారికి కూడా అదే చెప్తాను . డబ్బులు వృథా చేయకుండా .. ఇలా ల్యాండ్ ‌ పై ఇన్వెస్ట్ ‌ చేస్తే భవిష్యత్ ‌ బాగుంటుందని చెప్తాను ’ అని కొమురం చెప్పుకొచ్చాడు . ‘మీ ఆస్తి మొత్తం విలువ దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉంటుందా?’ అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు..నవ్వుతూ ‘అంత ఉందని చెప్పలేను కానీ.. అదృష్టం కొద్ది అప్పట్లో తక్కువ ధరకు ల్యాండ్‌ కొంటే.. ఇప్పుడు దాని విలువ పెరిగింది’ అని చెప్పాడు.

జబర్దస్త్‌ కొమురక్క నిజాయితీ, పట్టుదల, భార్య ప్రోత్సాహంతోనే విజయం సాధించారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, తన పట్ల నమ్మకంతో ముందడుగు వేయడం అందరికీ ఆదర్శప్రాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.