|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్! SKN సంచలన నిర్ణయం! మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!!

Published: 30-03-2026, 12:05 PM
రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్! SKN సంచలన నిర్ణయం! మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్: జూన్ 26న గ్రాండ్ రిలీజ్!
  • నిర్మాత SKN సంచలన ప్రకటన: ‘పెద్ది’ కోసం తమ సినిమా రిలీజ్ వాయిదా!
  • ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్‌లో SKN వెల్లడి: రామ్ చరణ్ సినిమాకు దారి ఇవ్వడానికి నిర్ణయం!
  • మెగా ఫ్యాన్స్‌కు పండుగ: జూన్ 26న థియేటర్లలో రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ అల్లరి షురూ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాత SKN గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

జూన్ 26న ‘పెద్ది’ విడుదల: SKN ప్రకటన!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొంతకాలం క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తేదీన సినిమా విడుదల కావడం కష్టమని, విడుదల వాయిదా పడే అవకాశం ఉందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ బృందం నిర్వహించిన ‘గుర్తుందా సాంగ్’ విడుదల ఈవెంట్‌లో నిర్మాత SKN కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ… తమ సినిమాను జూన్ 26న విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశామని, అయితే అదే తేదీన రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాజేష్ గారు ఇప్పుడే చెప్పారని తెలిపారు. దాంతో తమ సినిమాను ఆ తేదీ నుండి తప్పిస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలతో ‘పెద్ది’ సినిమాను జూన్ 26న విడుదల చేయడం ఆల్మోస్ట్ ఖరారు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రామ్ చరణ్ కోసం SKN త్యాగం: సినిమా వాయిదా!

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ జూన్ 26న విడుదల కానుండటంతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.