
యంగ్ హీరోయిన్ సోనమ్ ప్రీత్ బాజ్వా ‘బాఘి-4’ సినిమాలో నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సోనమ్, ఈ సినిమా షూటింగ్, గణేష్ మాస్టర్ తో పనిచేయడం గురించి మాట్లాడింది. ఆమె చిన్నప్పటి కల నెరవేరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది.
Key Points
సోనమ్ ప్రీత్ బాజ్వా 'బాఘి-4' లో కీలక పాత్ర పోషిస్తోంది.
గణేష్ మాస్టర్‌తో కలిసి పనిచేయడం ఆమె కల అని సోనమ్ తెలిపింది.
చిన్నప్పటి నుండి డ్యాన్స్ సాంగ్ చేయాలని ఆమె కోరిక.
సెప్టెంబర్ 5న 'బాఘి-4' సినిమా విడుదల కానుంది.
‘బాఘి-4’ షూటింగ్ అప్డేట్
యంగ్ హీరోయిన్ సోనమ్ ప్రీత్ బాజ్వా(Sonam Preet Bajwa) ‘బెస్ట్ ఆఫ్ లక్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత తమిళ, హిందీ పంజాబీ చిత్రాల్లో అవకాశాలు అందుకుని వరుస ప్రాజెక్ట్స్ చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అక్కినేని హీరో సుమంత్ ‘ఆటాడుకుందాం రా’ మూవీలో నటించి మెప్పించింది. కానీ పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘బాఘి-4’ మూవీలో నటిస్తోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్ ‘బాఘి-4’ (Baaghi-4)అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘మేము ఈ రోజు ‘బాఘి-4’ కోసం ఒక పాటను చిత్రీకరించాము. గణేష్ సర్‌తో కలిసి పనిచేయడం ఒక కల.
గణేష్ మాస్టర్ తో సహకారం
అతను ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. చిన్నప్పటి నుండి డ్యాన్స్ ఉన్న సాంగ్ చేయాలనేది నా కల. అది ఈ పాటతో నా కల నెరవేరబోతోంది. గత కొన్ని రోజులుగా మేము షూటింగ్ చేస్తున్నాము. ఇది చాలా బాగా జరుగుతోంది. సూపర్ ఎగ్జైటెడ్” అని చెప్పుకొచ్చింది. కాగా, ఈ సినిమా ఎ. హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సాజిత్ నడియావాలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇందులో సంజయ్ దత్(Sanjay Dutt), రాజ్ అరోరా, హర్నాజ్కర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ‘బాఘి-3’ సీక్వెల్‌గా రాబోతుండటం విశేషం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.
సోనమ్ కల నెరవేర్పు
A post shared by Sonam Bajwa (@sonambajwa)
చిన్నప్పటి నుంచి డ్యాన్స్ సాంగ్ చేయాలన్న సోనమ్ కల ‘బాఘి-4’ సినిమాతో నెరవేరుతోంది. గణేష్ మాస్టర్ తో పనిచేయడం ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.


