
📌 Key Points
- దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులకు ఉచిత వసతి కల్పించనున్న సోనూ సూద్.
- యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ లో చిక్కుకున్న భారతీయులకు, విదేశీయులకు సహాయం.
- మానవత్వమే ముఖ్యమని భావించి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని ప్రకటన.
- కరోనా సమయంలో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా నిలిచిన సోనూ సూద్.
ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. దుబాయ్లో చిక్కుకుపోయిన భారతీయులకు మరియు ఇతర దేశాల ప్రయాణికులకు ఉచితంగా వసతి కల్పించనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దుబాయ్ లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూసూద్ అండ
Sonusood: ‘సూపర్’ సినిమాలో తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సోనూసూద్ (Sonusood ).. ‘అరుంధతి’ సినిమాలో “వదలా బొమ్మాళీ నిన్ను వదలా ” అని పశుపతి క్యారెక్టర్ తో ప్రేక్షకులను భయపెట్టి.. విలనిజం ఏంటో నిరూపించారు. అలాంటి సోనూసూద్ రియల్ హీరోగా మానవత్వం చాటుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టం వచ్చినవారికి చేయూతనిస్తూ.. అండగా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. రియల్ హీరోగా పేరు దక్కించుకున్న సోనూ సూద్ ప్రస్తుతం ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ లో చిక్కుకుపోయిన అమాయకపు ప్రజల కోసం తన వంతు అండగా నిలుస్తానని భరోసా ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం అంతర్జాతీయ యుద్ద పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు రద్దయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వందలాది మంది సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా దుబాయ్ లో చిక్కుకుపోయారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికుల పట్ల రియల్ హీరో సోనూ సూద్ తన ఉదారతను చాటుకున్నారు. విదేశీ గడ్డపై దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి అండగా నిలుస్తూ అక్కడ ఇబ్బంది పడుతున్న వారందరికీ ఉచితంగా వసతి కల్పించనున్నట్లు స్వయంగా ప్రకటించడంతో అక్కడి ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
మానవత్వమే ముఖ్యమన్న సోనూసూద్
అయితే ఈ సహాయం చేయడంలో షరతులు పెట్టుకోని సోనుసూద్.. ఈ విపత్కరమైన పరిస్థితులలో దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఏ దేశానికి చెందిన ప్రయాణికులైనా సరే ఆపదలో ఉన్నప్పుడు మానవత్వమే ముఖ్యమని భావించి ప్రతి ఒక్కరికి ఉచితంగా వసతి కల్పిస్తానని నిర్ణయం తీసుకుంటూ ఈ విషయాన్ని ప్రకటించారు.ఈ ప్రకటనతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప మనసు.. కోట్లల్లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోనూ సూద్ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వలస కార్మికులకు సహాయం చేసి రియల్ హీరోగా గుర్తింపు
ఇకపోతే సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సోనూసూద్ కరోనా కష్టకాలంలోనే లక్షలాది మంది వలస కార్మికులను క్షేమంగా వారి గమ్యస్థాలకు చేర్చి ప్రజా మనిషిగా గుర్తింపు తెచ్చుకొని.. తన గొప్ప మనసుతో వెలుగులోకి వచ్చారు. ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించారు. అంతేకాదు ప్రత్యేకించి వ్యవసాయ పనిముట్లను కూడా అందించి వారి గుండెల్లో దేవుడిగా స్థానాన్ని నిలుపుకున్నారు. ఇలా ఒక్కటేమిటి ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకుంటున్న ఈయన ఇప్పుడు దుబాయ్లో ప్రయాణికుల కోసం కూడా తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భవిష్యత్తులో కూడా ఇలాగే మంచి పనులు చేస్తూ మరింత మందికి అండగా నిలవాలని ఆయన అభిమానులు, నెటిజన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సోనూసూద్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు అని కొనియాడుతున్నారు. ఆయన గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు.


