
📌 Key Points
- గల్ఫ్ దేశాల్లోని తెలుగువారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- APNRT ద్వారా లక్షకు పైగా తెలుగువారు రిజిస్టర్ చేసుకున్నారు.
- సహాయం కోసం APNRTC హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- వీసా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చు.
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడి తెలుగు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. APNRTS ద్వారా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజల భయాందోళనలు
గల్ఫ్ దేశాలపై ఇరాన్ యుద్ధం నేపథ్యంలో.. ఆయా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ సమయంలో ఏ మిస్సైల్ వచ్చి పడుతుందోనని భయాందోళన చెందుతున్నారు. సొంతూళ్లలో ఉన్నవారు తమవారు ఎలా ఉన్నారోనని దిగులు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడినట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు ఆందోళన చెందవద్దని కోరారు. APNRTలో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నవారిలో లక్షకుపైగా తెలుగువారి రిజిస్టర్ అయ్యారని తెలిపారు. రిజిస్టర్ చేసుకోని వారు 5 నుంచి 7 లక్షల వరకూ ఉండవచ్చని అంచనా ఉందని చెప్పారు. వీరందరినీ సేఫ్ గా తీసుకువచ్చేందుకు గల్ఫ్ దేశాల అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపారు.
ఏపీ ఎన్నార్టీ కో-ఆర్డినేటర్ల ద్వారా ఆయా దేశాల్లో ఉన్న తెలుగువారి కోసం టెంపరరీ వసతి ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, సహాయం కావాలన్నా APNRTC హెల్ప్ లైన్ నంబర్ 0863-2340678కు కాల్ చేసి తెలియజేయాలని, లేదా వాట్సాప్ నంబర్ +91 8500027678 నంబర్ కు చేయాలని సూచించారు. [email protected] ను కూడా సంప్రదించవచ్చని మంత్రి కొండపల్లి తెలిపారు. ఎవరికైనా వీసా ఎక్స్పైర్ అయినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కు ఇన్ ఫాం చేస్తే వెంటనే దానిని తాత్కాలిక ఎక్స్ టెన్షన్ చేయిస్తామన్నారు.
తెలుగువారిని ఆదుకునేందుకు ప్రభుత్వ చర్యలు
APNRTS హెల్ప్ లైన్ వివరాలు
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు భయాందోళన చెందకుండా, ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఎటువంటి సమస్య ఉన్నా హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించండి.


