|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సౌందర్య సంచలనం: సినిమా డేట్స్ రగడ! అప్పట్లో ఏం జరిగిందో తెలిస్తే షాక్!

Published: 18-03-2026, 11:35 AM
సౌందర్య సంచలనం: సినిమా డేట్స్ రగడ! అప్పట్లో ఏం జరిగిందో తెలిస్తే షాక్!
  • సౌందర్య కెరీర్ తొలినాళ్లలో డేట్స్ వివాదం: నిర్మాతల మండలికి ఫిర్యాదు!
  • హీరోయిన్ ఓరియంటెంటెడ్ సినిమా కావడంతో డేట్స్ ఇచ్చినా.. కారణాల వల్ల షూటింగ్ జరగలేదన్న సౌందర్య.
  • ఒంగోలు ఎండల గురించి మాట్లాడితే.. సినిమాకు లింక్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సౌందర్య.
  • చిన్న, పెద్ద సంస్థల తారతమ్యం చూడనని.. ముత్యాల సుబ్బయ్య సినిమా ఎందుకు వదులుకుంటానన్న సౌందర్య!

టాలీవుడ్ దిగ్గజం సౌందర్య గురించి ఒక షాకింగ్ న్యూస్! ఆమె కెరీర్ తొలినాళ్లలో సినిమా డేట్స్ విషయంలో వివాదం చెలరేగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి!

సౌందర్య డేట్స్ ఇష్యూ: అసలేం జరిగింది?

Soundarya : ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఎంతోమందికి ఫేవరేట్ హీరోయిన్ సౌందర్య. తన సినిమాలతో, నటనతో, మంచితనంతో అప్పట్లో ప్రేక్షకులని మెప్పించింది. కానీ దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. సౌందర్య వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే అలాంటి సౌందర్య కూడా ఓ సినిమా డేట్స్ విషయంలో వివాదంలో నిలిచింది.

1994లో ఓ సినిమాకు డేట్స్ ఇచ్చి తర్వాత డేట్స్ ఇవ్వట్లేదు అని, డేట్స్ ఇవ్వను అని సౌందర్య చెప్పినట్టు వార్తలు వచ్చాయి. టి.కృష్ణ మెమోరియల్ నిర్మాణ సంస్థకు డేట్స్ ఇచ్చి చివరి నిమిషంలో సౌందర్య సినిమా చేయను అని చెప్పిందని వార్తలు వచ్చాయి. దీనిపై సౌందర్య అప్పట్లో ఓ పేపర్ కి ఇంటర్వ్యూ ఇచ్చి ఈ వివాదం గురించి వివరణ ఇచ్చింది.

నిర్మాతల ఆరోపణలు.. సౌందర్య వివరణ!

సౌందర్య మాట్లాడుతూ.. టి.కృష్ణ మెమోరియల్ సంస్థ వాళ్ళు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నామని ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్ అని చెప్పారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనగానే వెంటనే ఓకే చెప్పి మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు దఫాలుగా డేట్స్ కూడా ఇచ్చాను. కాని వారి స్వంత కారణాల మూలంగా నేను ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ చేయలేదు. మధ్యలో ఒకసారి వచ్చి ఏప్రిల్ లో షూటింగ్ చేద్దామని అన్నారు కాని చెయ్యలేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎప్పుడు సినిమా చేస్తామన్నా డేట్స్ ఇస్తానని చెప్పాను. కాని మే నెలలో వచ్చి మొత్తం షూటింగ్ కి ప్లాన్ చేసుకున్నాము, డేట్స్ ఇవ్వమని అడిగారు. అప్పటికే మే, జూన్ నెలల్లో వేరే సంస్థలకి డేట్స్ ఇచ్చాను.

అందుకే జూలైలో చేద్దామని చెప్పాను. కాని వాళ్ళు నా మాట వినకుండా ఇందులో నాదే తప్పంటూ ప్రకటనలు ఇచ్చారు. ఒక సందర్భంలో మే నెలలో ఒంగోలులో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి కదా అని నేను జనరల్ గా అన్నాను కాని దాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకుని సినిమాకు లింక్ చేసి ఇలాంటి ఆరోపణలు చేస్తారని అనుకోలేదు. ఇచ్చిన డేట్స్ లో సినిమా చేయకుండా సడెన్ గా వచ్చి వారికి కావలసిన డేట్స్ ఇమ్మంటే ఎలా సాధ్యం అవుతుంది. ఏ హీరోయిన్ అయినా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనగానే ఫస్ట్ ప్రియార్టీ ఇస్తారు. కావాలని సినిమాని వదులుకోరు. నేను డేట్స్ ఇచ్చి ఎగ్గొట్టలేదు ఎవరికి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకొని సినిమాలు చేస్తున్నాను. నాకు చిన్నసంస్థ, పెద్ద సంస్థ అనే తారతమ్యాలు లేవు. పైగా ముత్యాల సుబ్బయ్య గారి సినిమా ఎందుకు వదులుకుంటాను. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న నన్ను ఇలా విమర్శించడం ఎంత వరకూ సబబో విజ్ఞులు ఆలోచించాలి అని తెలిపింది.

వివాదంపై సౌందర్య సీరియస్ రియాక్షన్!

అలా సౌందర్య టాలీవుడ్ లో వచ్చిన తన డేట్స్ వివాదం గురించి క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత సౌందర్యతో అనుకున్న సినిమాని మహేశ్వరి తో తీశారు. ఆ సినిమానే 1995 లో వచ్చిన అమ్మాయి కాపురం. ఈ సినిమా మంచి విజయం సాధించి నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఆ తర్వాత సౌందర్య ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, సూర్యుడు, అన్నయ్య.. సినిమాలు చేసింది.

సౌందర్య సినిమా డేట్స్ వివాదం ఒక సంచలనం సృష్టించింది. ఆనాటి పరిస్థితులు, సౌందర్య వివరణ ఆసక్తికరంగా ఉన్నాయి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.