|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సౌందర్య సీక్రెట్స్ లీక్: ఫ్యామిలీకి కూడా తెలియని నిజాలు! ఒక్క సెకనులో అడ్రస్ గల్లంత్!

Published: 12-04-2026, 10:05 AM
సౌందర్య సీక్రెట్స్ లీక్: ఫ్యామిలీకి కూడా తెలియని నిజాలు! ఒక్క సెకనులో అడ్రస్ గల్లంత్!
  • సౌందర్య మరణం వెనుక మిస్టరీ.. ఆస్తుల లెక్కలు ఎవరికీ తెలియవట!
  • బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు: సౌందర్యను స్టార్ చేసింది నేనే!
  • అమ్మోరు సినిమాతో సౌందర్య దశ తిరిగింది: బాబు మోహన్
  • సౌందర్య చివరి రోజుల్లో కుటుంబానికి చెప్పని సీక్రెట్స్ దాచారా?

టాలీవుడ్ దిగ్గజం సౌందర్య గురించి సంచలన విషయాలు బయటపెట్టిన బాబు మోహన్! సౌందర్య ఆస్తుల గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

సౌందర్య ఆస్తుల చిక్కుముడులు వీడేనా?

ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ గురించి పరిచయం అవసరం లేదు. కొన్ని వందల చిత్రాల్లో బాబు మోహన్ కమెడియన్ గా నటించారు. దాదాపు 3 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. రాజకీయ నేతగా కూడా ఆయన విజయం సాధించారు. హీరో హీరోయిన్ల కాంబినేషన్ గురించి అభిమానులు ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు.

కానీ కమెడియన్, హీరోయిన్ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవడం సౌందర్య, బాబు మోహన్ నుంచే స్టార్ట్ అయింది. వీరిద్దరూ చినుకు చినుకు అందెలతో అనే సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు సౌందర్య కటౌట్ పక్కనే నా కటౌట్ కూడా పెట్టారు. అది చూసి నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నా.

బాబు మోహన్ చెప్పిన షాకింగ్ నిజాలు!

ఆ సాంగ్ చేసే సమయానికి సౌందర్య స్టార్ హీరోయిన్ కాదు. ఆమె స్టార్ హీరోయిన్ అయింది నావల్లే. కోడి రామకృష్ణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అమ్మోరు అనే సినిమా తీయాలి అనుకున్నారు. ఇన్నోసెంట్ గా ఉండే అమ్మాయిని హీరోయిన్ గా పెట్టాలి అని దాదాపు 75 స్కూల్స్ గేట్ల వద్ద వెతికారు. ఆ టైంలో నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి సౌందర్య గురించి చెప్పాను.

ఒక అమ్మాయి బెంగుళూరు నుంచి వచ్చింది. భలే ఉంది సార్ ఆ అమ్మాయి అని చెప్పాను. ఆమె స్టిల్స్ ఫోటోలు కూడా వాళ్లకు ఇచ్చాను. ఆ విధంగా సౌందర్య అమ్మోరు మూవీకి ఎంపిక అయింది. దెబ్బకు ఆ సినిమాతో ఆమె స్టార్ గా మారిపోయింది. కానీ ఆమె అంత పిన్న వయసులో మరణించడం చాలా దురదృష్టం. హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ ఇద్దరూ మరణించారు. అంతకు ముందే ఆమె తండ్రి మరణించారు. సౌందర్య షూటింగ్ సంగతులు, రెమ్యునరేషన్ మొత్తం చూసుకునేది వాళ్ళ నాన్నగారే. ఆ తర్వాత ఆమె సోదరుడు చూసుకునేవారు. వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. బయట విషయాలు ఆమెకి తెలియవు.

అమ్మోరు సినిమాతో సౌందర్య స్టార్ హీరోయిన్ అయింది!

సౌందర్య భర్త బయట వ్యక్తి. ఆమె సోదరుడు అమర్నాథ్ భార్య కూడా బయట వ్యక్తి. సౌందర్య సంపాదించిన ఆస్తుల గురించి ఆమెతో పాటు ఆమె తండ్రికి, అమర్నాథ్ కి మాత్రమే తెలుసు. ఆమె భర్తకి కూడా తెలియదు. దీనితో వీళ్ళిద్దరూ మరణించడంతో ఒక్క సెకనులో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి మారిపోయింది. అడ్రెస్ లేని ఫ్యామిలీ లాగా అయిపోయింది అని బాబు మోహన్ అన్నారు.

సౌందర్య మరణం మరియు ఆమె జీవితంలోని రహస్య కోణాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బాబు మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.