
📌 Key Points
- దక్షిణ మధ్య రైల్వే వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగకరంగా ఉంటాయి.
- రైల్వే శాఖ కొన్ని రైలు సర్వీసులను పొడిగించింది.
- ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
వేసవి రద్దీకి దక్షిణ మధ్య రైల్వే చర్యలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా పలు రాష్ట్రాల మధ్య ప్రయాణం చేయవచ్చు. సీజనల్ రష్‌ను నిర్వహించేందుకు అదనపు స్పెషల్ ట్రైన్స్‌ను పొడిగించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
చర్లపల్లి-తిరుచానూరు, తిరుపతి-అకోలా, కాచిగూడ-తిరుచానూరు, తిరుపతి-చర్లపల్లి, నాందెడ్-తిరుచానూరు, చర్లపల్లి,-తిరుచానూరు, సికింద్రాబాద్-అనకాపల్లి, తిరుపతి-నరసాపూర్, నాందెడ్-ధర్మవరం, చర్లపల్లి-నరసాపూర్, కాకినాడ టౌన్-లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-కాకినాడ టౌన్, జల్నా-తిరుచానూర్, చర్లపల్లి-అనకాపల్లి, సికింద్రాబాద్ -అనకాపల్లి, కాకినాడ టౌన్-మైసూర్, చర్లపల్లి-భువనేశ్వర్ న్యూ, తిరుపతి-పందార్‌పూర్, హైదరాబాద్-బెళగావి. ఈ ట్రైన్లు రెండు వైపులా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు
మరోవైపు కొన్ని రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.
వేసవి కాలంలో ప్రయాణ రద్దీని తగ్గించడం, ప్రధాన గమ్యస్థానాల మధ్య అదనపు కనెక్టివిటీని కల్పించడం ఈ పొడిగింపు లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకొని, ఈ ప్రత్యేక సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
పొడిగించిన రైలు సర్వీసులు – పూర్తి వివరాలు
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.


