|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

64 ఏళ్ల హీరో సినిమాలో రుక్మిణి వసంత్ కు స్పెష‌ల్ రోల్ ?

Published: 08-10-2025, 4:02 PM
64 ఏళ్ల హీరో సినిమాలో రుక్మిణి వసంత్ కు స్పెష‌ల్ రోల్ ?

కన్నడ నటి రుక్మిణి వసంత్, ‘కాంతార చాప్టర్ 1’లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ లభించినట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో రుక్మిణికి నెగటివ్ రోల్ లభించిందని సమాచారం.

Key Points

1

రుక్మిణి వసంత్ 2019లో కన్నడలో అరంగేట్రం చేసి తెలుగులో 'అప్పుడో ఇప్పుడు ఎప్పుడో'తో పాపులారిటీ పొందింది.

2

'కాంతార చాప్టర్ 1'లో కనకావతి అనే విలన్ పాత్రతో అందరినీ ఆకట్టుకుంది.

4

వెంకటేష్ 64 ఏళ్ల సినిమాలో రుక్మిణి వసంత్ కీలకమైన నెగటివ్ పాత్రలో కనిపించనుందని సమాచారం.

రుక్మిణి వసంత్: ‘కాంతార’ తర్వాత పాపులారిటీ

దిశ‌, వెబ్ డెస్క్ : కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రుక్మిణి వసంత్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 2019 సంవత్సరంలోనే కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడిప్పుడే తెలుగులో పాపులారిటీని దక్కించుకుంటోంది. 2024 సంవత్సరంలో వచ్చిన అప్పుడో ఇప్పుడు ఎప్పుడో అనే సినిమాతో మెరిసిన రుక్మిణి, ఈ మధ్యకాలంలో కాంతార చాప్టర్ 1 సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమాలో కనకావతి అనే బ్యూటిఫుల్ పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు రుక్మిణి. ఎవరు ఊహించని రీతిలో విలన్ పాత్రలో అందరినీ మెప్పించారు రుక్మిణి వసంత్.

అయితే, ఇప్పుడు ఈ బ్యూటీకి మరో అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ వారమే ఈ సినిమా పూజా కార్యక్రమం ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. నయనతార, త్రిష లాంటి వాళ్లను సంప్రదిస్తున్నారట. అయితే 64 సంవత్సరాల వయసున్న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా నెగిటివ్ పాత్ర అని సమాచారం. కాంతారా చాప్టర్ వన్ తరహా లోనే ఉంటుందట. దీంతో ఆమె పాత్ర పై ఆసక్తి నెలకొంది.

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమా

రుక్మిణి వసంత్ పాత్ర: నెగటివ్ షేడ్స్?

వెంకటేష్ సినిమా పూజా కార్యక్రమం

మొత్తానికి, రుక్మిణి వసంత్ కాంతార తర్వాత మరోసారి విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడం పట్ల సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆమె నెగటివ్ రోల్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.