
దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న #SSMB29 సినిమా నుంచి అభిమానులకు భారీ సర్ ప్రైజ్ లభించింది. ఒకే ఈవెంట్లో టైటిల్ ‘వారణాసి’, మహేష్ ‘రుద్ర’ లుక్, రిలీజ్ డేట్ సహా ఐదు అప్డేట్స్ ను జక్కన్న విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
Key Points
రాజమౌళి #SSMB29 సినిమాకు ఒకే ఈవెంట్లో 5 కీలక అప్డేట్స్ ప్రకటించారు.
వారణాసి టైటిల్, మహేష్ బాబు 'రుద్ర' లుక్, రిలీజ్ డేట్ వీటిలో ముఖ్యమైనవి.
నంది వాహనంపై మహేష్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా, సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఒకే సినిమాలో ఇన్ని అప్డేట్స్ ఒకేసారి ఇవ్వడం రాజమౌళికి ఇదే మొదటిసారి.
రాజమౌళి ఇచ్చిన 5 సర్‌ప్రైజ్‌లు ఏమిటి?
దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో #SSMB29వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ ను శనివారం సాయంత్రం #GlobeTrottereventలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వారణాసి పేరుతో టైటిల్ గ్లింప్స్, మహేశ్ లుక్ ను జక్కన్న విడుదల చేయగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో వీడియో విడుదలవ్వగా.. ఆ వీడియో చూసిన అభిమానులు గూస్ బంప్స్ తెప్పిస్తోందని, 2027 వరకూ ఆగలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రుద్రగా కనిపించిన మహేశ్.. నంది వాహనంపై కూర్చున్న లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఉగ్రరూపంలో ఉన్న మహేశ్ ను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈవెంట్ లో టైటిల్, మహేష్ లుక్, క్యారెక్టర్ రివీల్ తో పాటు.. రిలీజ్ డేట్, స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయడంతో.. జక్కన్న ఇచ్చిన సర్ ప్రైజ్ లకు ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. త్రేతాయుగం, హనుమంతుడు, రాముడి ప్రస్తావన కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఎన్నడూ లేని రీతిలో రాజమౌళి ఒక సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ ను ఇలా ఒక ఈవెంట్ లో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. #GlobeTrotterగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా టైటిల్, మహేశ్ లుక్, క్యారెక్టర్ నేమ్, రిలీజ్ డేట్, స్పెషల్ వీడియో.. ఇలా ఐదు అప్ డేట్స్ ను ఒక ఈవెంట్లోనే అనౌన్స్ చేశారు.
మహేష్ బాబు ‘రుద్ర’ లుక్, టైటిల్ రివీల్
SSMB29పై భారీ అంచనాలు, ఫ్యాన్స్ రియాక్షన్
ఒకే ఈవెంట్లో ఐదు కీలక అప్డేట్స్ ఇవ్వడం రాజమౌళికి ఇదే మొదటిసారి. ఈ ఊహించని సర్‌ప్రైజ్‌లతో #SSMB29 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మహేష్ బాబు రుద్ర లుక్‌తో ఫ్యాన్స్‌ను మరింత ఆకట్టుకోవడం ఖాయం.


