|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్పిరిట్‌లో విలన్‌గా డాన్ లీ ఎందుకన్నా.. నువ్వే చేయొచ్చుగా.. ఫ్యాన్స్ ప్రశ్నకు సందీప్ రెడ్డి వంగా ఆన్సర్ ఏంటో తెలుసా?

Published: 07-09-2025, 8:14 PM
స్పిరిట్‌లో విలన్‌గా డాన్ లీ ఎందుకన్నా.. నువ్వే చేయొచ్చుగా.. ఫ్యాన్స్ ప్రశ్నకు సందీప్ రెడ్డి వంగా ఆన్సర్ ఏంటో తెలుసా?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విలన్‌గా డాన్ లీ నటించడంపై అభిమానుల ప్రతిస్పందన, సందీప్ రెడ్డి వంగా సమాధానం ఇక్కడ చూడండి.

Key Points

1

స్పిరిట్ సినిమాలో డాన్ లీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

2

సందీప్ రెడ్డి వంగా అభిమానులు ఆయనకే విలన్ పాత్ర చేయమని కోరారు.

4

ప్రభాస్ కు డాన్ లీ పవర్ ఫుల్ విలన్ గా సరిపోతాడని అభిప్రాయం.

స్పిరిట్ సినిమా విలన్ ఎంపిక

విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. మొదటి తెలుగు సినిమా అర్జున్ రెడ్డి తోనే డిఫరెంట్ అండ్ బోల్డ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇక యానిమల్ మూవీతో ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.

అప్పటివరకు అలాంటి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సీన్స్‌తో ఏ దర్శకుడు చేయని సాహసాన్ని చేసి సక్సెస్ సాధించిన ఘనత సందీప్ రెడ్డి వంగాది. అంతేకాకుండా మూడు గంటల రన్‌టైమ్‌తో సినిమాను తెరకెక్కించి అంతసేపు ఫుల్ ఎంగేజింగ్‌గా ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టిన ఫస్ట్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డినే నిలుస్తారు.

సందీప్ రెడ్డి వంగా టేకింగ్‌ను ప్రేక్షకులతోపాటు దర్శక దిగ్గజాలు అయిన ఎస్ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్లు సైతం ప్రశంసించారు. అలాగే, రియల్ లైఫ్‌లో సందీప్ రెడ్డి వంగా మాటలకు, ఇచ్చే కౌంటర్లకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సందీప్ రెడ్డిలా ఆన్సర్స్ ఇవ్వాలని అనుకుంటానని మరో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా చెప్పారు.

ఇంతటీ క్రేజ్ ఉన్న సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ తెరకెక్కిస్తున్న సినిమా స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ క్రేజ్ ఒకవైపు, సందీప్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరోవైపు స్పిరిట్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కు అంచనాలు అనే పదం చాలా చిన్నది అవుతుంది. అలాంటి స్పిరిట్ సినిమాకు విలన్‌గా ఎలాంటి యాక్టర్ ఉండాలని కోరుకుంటారో తెలిసిందే.

డాన్ లీ నటన

అయితే, స్పిరిట్ మూవీలో ప్రభాస్‌ కు పోటీ ఇచ్చి పవర్‌ఫుల్ విలన్‌గా సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ అలియాస్ మా డాంగ్-సియోక్ నటిస్తున్నాడు. కొరియన్ యాక్షన్ హీరోల్లో డాన్ లీ కి వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ ఉంది. భారీ దేహంతో పవర్‌ఫుల్‌గా కనిపించే డాన్ లీ స్పిరిట్‌లో విలన్‌గా ప్రభాస్‌కు సూపర్ మ్యాచ్ అని అంతా భావించారు.

అయితే, రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగాకు తన అభిమానుల నుంచి స్వీట్ రిక్వెస్ట్ ఒకటి అందింది. సందీప్ రెడ్డి వంగా స్నేహితుడు కృష్ణ వోడపల్లి నిర్మాతగా రూపొందించిన సినిమా జిగ్రీస్. ఈ జిగ్రీస్ మూవీ టీజర్‌ను సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగాకు తన ఫ్యాన్స్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.

అదే “స్పిరిట్‌లో డాన్ లీ విలన్‌లా ఎందుకు అన్నా?.. నువ్వే చేయొచ్చుగా.. సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ కోసం” అని. ఆ ఈవెంట్‌లో ప్లకార్డ్‌పై ఇలా రాసి సందీప్ రెడ్డి వంగాకు చూపించారు. దానిని సందీప్ రెడ్డి వంగాకు చూపిస్తూ యాంకర్ చదివి వినిపించింది.

సందీప్ రెడ్డి వంగా స్పందన

అది విన్న సందీప్ రెడ్డి వంగా నవ్వి.. “అయితది.. అయితది.. అన్ని అయితయ్.. థాంక్యూ థాంక్యూ” అని సమాధానం ఇచ్చాడు. దానికి అక్కడున్న సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ అంతా సంతోషంతో కేకలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే, యానిమల్ సినిమాలో అబ్రార్ (బాబీ డియోల్) తమ్ముడు, రణ్‌విజయ్ ( రణ్‌బీర్ కపూర్ ) క్లోన్‌ అజీజ్‌ పాత్రకు సందీప్ రెడ్డి వంగానే డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.

సందీప్ వాయిస్ ఆ పాత్రకు హై ఇంటెన్స్ క్రియేట్ చేసింది. అలాంటిది నిజంగా స్పిరిట్‌ లో కానీ, ఇంకేదైనా సినిమాలో సందీప్ రెడ్డి వంగా విలన్‌గా చేస్తే.. అది అభిమానులు, ఆడియెన్స్ ఊహకే వదిలేద్దాం.

చివరగా, సందీప్ రెడ్డి వంగా సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. డాన్ లీ నటన ప్రభావం ఎంత ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.