
ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రంతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌ని ప్లాన్ చేస్తున్నాడనే వార్త అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమా అప్డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్.
Key Points
'స్పిరిట్'తో సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్.
ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
ముంబై, మెక్సికో, థాయిలాండ్ లలో షూటింగ్ జరగనుంది.
సందీప్ వంగ ప్లాన్: సినిమాటిక్ యూనివర్స్
Spirit : ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ లిస్ట్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ సినిమాలు పూర్తయ్యాక స్పిరిట్ సినిమా మొదలు కానుంది.(Spirit)
సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసి, లొకేషన్స్ కూడా ఫైనల్ చేసి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా స్పిరిట్ సినిమా గురించి ఓ ఆసక్తికర టాక్ నడుస్తుంది. సందీప్ రెడ్డి వంగ దీన్ని సినిమాటిక్ యూనివర్స్ లా మారుస్తాడట.
‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్ర
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు సందీప్ చెప్పాడు. ప్రభాస్ పాత్రని సెంటర్ చేసుకొని ఆ కథ చుట్టూ వేరే పాత్రలతో సినిమాటిక్ యూనివర్స్ సృష్టిస్తాడని సమాచారం. అందుకే స్పిరిట్ సినిమాలో పూర్తి ఎండింగ్ ఇవ్వకుండా ఇంకో సినిమాకి లీడ్ ఇస్తారట. స్పిరిట్ సినిమాటిక్ యూనివర్స్ అనే వార్త వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
షూటింగ్ అప్డేట్స్, లొకేషన్స్
ప్రభాస్ తో సందీప్ వంగ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ముంబై, మెక్సికో, థాయిలాండ్ లో జరగనుంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని టాక్ నడుస్తుంది. కానీ ఇది మొదలవ్వాలంటే ఫౌజీ సినిమా షూటింగ్ పూర్తవ్వాలి.
సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’తో ఏదో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనతో ఈ సినిమా తప్పకుండా భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.


