|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్‌పై సస్పెన్స్ వీడేదెప్పుడు? వంగా మౌనం వెనుక మర్మమేంటి?

Published: 08-05-2026, 6:01 AM
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్‌పై సస్పెన్స్ వీడేదెప్పుడు? వంగా మౌనం వెనుక మర్మమేంటి?
  • ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న విడుదల కావాల్సి ఉంది.
  • షూటింగ్ ఆలస్యం, విడుదల వాయిదాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
  • ప్రభాస్ ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం ప్రధాన కారణం.
  • దర్శకుడు సందీప్ వంగా క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వడం ఆలస్యానికి దారితీయవచ్చు.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా విడుదలపై కొత్త అనుమానాలు రేగుతున్నాయి. 2027 మార్చి 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం, ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడుతుందా అనే చర్చ జరుగుతోంది.

‘స్పిరిట్’ విడుదలపై అనుమానాలు ఎందుకు?

Spirit Movie:టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ మూవీ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. సినిమా షూటింగ్, రిలీజ్ డేట్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అసలు ఈ అనుమానాలకు తెరపడేది ఎప్పుడు? మేకర్స్ ఏం చెప్పబోతున్నారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం..

ప్రస్తుతానికి చిత్ర యూనిట్ ‘స్పిరిట్’ మూవీని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకుంది. భూషణ్ కుమార్, సందీప్ వంగా బృందం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగడం లేదని, విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా గుబులు మొదలైంది.

ప్రభాస్ డైరీ ఫుల్.. టైమ్ సరిపోతుందా?: అసలు ఫాన్స్ అనుకోటానికి కారణం చుస్తే, ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ‘ఫౌజీ’, మరోవైపు ‘కల్కి 2’ వంటి భారీ చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. వీటి మధ్యలో సందీప్ రెడ్డి వంగా సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం సవాల్‌గా మారింది. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడని మన వంగా, అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు వదిలిపెట్టరు. మరి ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ ఆ విజన్‌ను టైమ్‌కి పూర్తి చేయగలరా అన్నదే ఫాన్స్ డౌట్.

ప్రభాస్ బిజీ షెడ్యూల్: సవాల్‌గా మారిన డేట్స్

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఇక సినిమాగానే కాకుండా, ఇదొక ‘పాన్-వరల్డ్ ఎంటర్‌టైనర్’ అని చిత్ర యూనిట్ చెబుతోంది.

సందీప్ వంగా స్టైల్: కంటెంట్‌కే ప్రాధాన్యత

సందీప్ రెడ్డి వంగా డెడ్‌లైన్స్ కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆయన స్టైల్ అందరికీ తెలిసిందే. అందుకే ‘స్పిరిట్’ ఇప్పుడు ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద ఛాలెంజ్‌గా మారుతోంది. ఈ వాయిదా వార్తలు నిజమా కాదా అనేది మూవీ టీమ్ అధికారికంగా స్పందిస్తేనే మనకు తెలుస్తుంది. డైరెక్టర్ క్లారిటీ ఇస్తేనే ఫ్యాన్స్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు షూటింగ్ అప్‌డేట్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్ని అనుమానాలు ఉన్నా, ప్రభాస్ – వంగా కాంబో నుండి వచ్చే సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ ప్రియులు నమ్ముతున్నారు. ఆలస్యమైనా సరే, ఒక అద్భుతమైన బొమ్మను థియేటర్లలో చూడాలన్నదే అందరి కోరిక. ఇక మరి మార్చి 5, 2027న ప్రభాస్ పోలీస్ డ్రెస్ వేసుకుని థియేటర్లలోకి వస్తారో లేదో చూడాలి..

మొత్తంగా, ‘స్పిరిట్’ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ అనుమానాలకు త్వరలో తెరదించి, స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.