|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్క్విడ్‌ గేమ్‌ 3 రివ్యూ.. ప్రాణాంతక గేమ్‌కు ముగింపు పడిందా?

Published: 28-06-2025, 11:54 PM
స్క్విడ్‌ గేమ్‌ 3 రివ్యూ.. ప్రాణాంతక గేమ్‌కు ముగింపు పడిందా?

స్క్విడ్ గేమ్ సీజన్ 3 రివ్యూ ఇక్కడ ఉంది. డబ్బు కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఆటలో హీరో యొక్క పోరాటం, అతని నిర్ణయాలు మరియు ఫలితాల గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం.

Key Points

1

స్క్విడ్ గేమ్ లో హీరో ప్రాణాలతో ఆడుకునే ఆటకు ముగింపు పలికే ప్రయత్నం.

2

రెండో సీజన్ ముగింపు లేకుండా ఆగిపోవడం వల్ల కలిగిన ఉత్కంఠ.

4

చిన్న పసిపాప ఊపిరి తీసుకోవడం వల్ల హీరోలో మళ్ళీ పోరాట వీరుత్వం పుంజుకోవడం.

స్క్విడ్ గేమ్ సీజన్ 3 ప్రారంభం

టైటిల్‌: స్క్విడ్‌ గేమ్‌ వెబ్‌ సిరీస్‌ (మూడో సీజన్‌) తారాగణం: లీ జుంగ్‌ జే, లీ బ్యుంగ్‌ హు, వి హా జూన్‌ క్రియేటర్‌: హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్‌ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

చిన్నప్పుడు ఆడిన ఆటలకు లెక్కే లేదు. బడిలో తన్నులు తిన్నా, ఇంట్లో చీవాట్లు పెట్టినా సరే ఫ్రెండ్స్‌తో కలిసి పొద్దేక్కేదాకా ఆడుతుంటే ఆ మజానే వేరుండేది. కానీ, ఆ సరదా ఆటలే ప్రాణాంతకంగా మారితే? గేమ్స్‌ ప్రాణాలు తీస్తే.. అన్న ఆలోచనలో నుంచి వచ్చిందే స్క్విడ్‌ గేమ్‌. డబ్బు, స్వార్థం.. మనిషిని రాక్షసుడిలా మారుస్తుందని, విచక్షణ కోల్పోయేలా చేస్తుందని ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు.

మొదటి సీజన్‌లో ఏం జరిగింది? ఈ సిరీస్‌లో రెండు రకాల మనుషులుంటారు. పైసా కోసం ప్రాణాలకు తెగించేవారు.. వారి ప్రాణాలు పోతుంటే చూసి ఆనందించేవారు. తొలి సీజన్‌లో 456 మంది గేమ్‌ ఆడేందుకు వస్తారు. ప్లేయర్‌ 456 ( హీరో లీ జుంగ్‌ జే ) లక్ష్యం కూడా డబ్బు గెలుచుకోవడమే.. కానీ గేమ్‌ చివరి వరకు వచ్చేసరికి తనముందున్న 455 మంది పిట్టల్లా రాలిపోతారు. అవన్నీ తనను మానసికంగా డిస్టర్బ్‌ చేస్తాయి. కోట్లాది సంపదను గెలుచుకున్నా.. అది తనకు సంతోషాన్ని ఇవ్వదు. మనుషుల ప్రాణాలతో గేమ్‌ ఆడుతున్నవారి అంతు చూడాలని, ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు.. అదే మొదటి సీజన్‌.

హీరో యొక్క పోరాటం

రెండో సీజన్‌ ఎలా ముగిసింది? ప్లేయర్‌ 456 మరోసారి ఆటలో అడుగుపెట్టడంతో రెండో సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ గేమ్‌కు ఎలాగైనా ముగింపు పలకాలని ఆవేశానికి పోయి కొంతమంది ప్లేయర్ల చావుకు కారణమవుతాడు. అంతటితో రెండో సీజన్‌ ఎటువంటి ముగింపు లేకుండానే అర్ధాంతరంగా ఆగిపోతుంది. అసలు ప్లేయర్‌ 456.. ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అన్న ఉత్సుకతో మూడో సీజన్‌ ( Squid Game season 3 Review ) మొదలవుతుంది.  గేమ్‌ను ఎలాగైనా ఆపేయాలన్న కోపంతో గ్యాంగ్‌ను తయారు చేసుకుని విలన్‌కే ఎదురెళ్తాడు హీరో.

సిరీస్‌ను మలుపు తిప్పే సంఘటన ఈ క్రమంలో ఆ గ్యాంగ్‌లోని వారంతా చనిపోతారు. కానీ హీరోను మాత్రం చంపకుండా వదిలేస్తారు. నన్నెందుకు బతికించారు? చంపేయండి అని హీరో విలవిల్లాడతాడు. తనవల్ల ఏదీ మారదని.. ఏది జరగాలనుంటే అది జరుగుతుందని భావించి డీలా పడిపోతాడు. కానీ ఒక్క సంఘటన అతడిలో మళ్లీ శక్తిని, ధైర్యాన్ని నింపుతుంది. వరుసగా ప్రాణాలు పోతున్న ప్రదేశంలో ఓ చిన్నబిడ్డ ఊపిరి పోసుకుంటుంది. ఆ పసిపాప కోసం హీరో మళ్లీ పోరాటం మొదలుపెడతాడు. అప్పుడు సిరీస్‌ వేగం పుంజుకుంటుంది.

అంతిమ ముగింపు

విషాదకర క్లైమాక్స్‌ మంచి పైచేయి సాధించినప్పుడే అందరికీ ఆనందం. కానీ, చెడు విజయం సాధించినప్పుడు అది అందరికీ రుచించదు. క్లైమాక్స్‌ చాలామందికి మింగుడుపడదు. దీనికోసమేనా మూడు సీజన్లు సాగదీశారు అనిపిస్తుంది. ప్రాణాంతక ఆటలకు కేంద్రమైన దీవిని కనిపెట్టేందుకు ప్రయత్నించిన డిటెక్టివ్‌ కష్టం కూడా వృథాగా పోతుంది. ఇదే చివరి సీజన్‌ అని ప్రకటించారు కానీ, ఈ క్లైమాక్స్‌ చూస్తుంటే మాత్రం సీజన్‌ 4కూ ఆస్కారం ఉందన్న అనుమానాలు వెలువడుతున్నాయి.

సిరీస్‌ ఏం చెప్తోంది? డబ్బుకు షార్ట్‌కట్స్‌ ఉండవు. అలాంటి అడ్డదారులున్నాయంటే అది మీ ప్రాణాలతో పందెం కాస్తున్నట్లే లెక్క అని ఈ సిరీస్‌ హెచ్చరిస్తుంది. డబ్బు మనిషిని ఎలా ఏమార్చుతుందని చూపించారు. పసిపాప ప్రాణానికి హీరో తన ప్రాణం అడ్డేసినప్పుడు మంచితనం, మానవత్వం ఇంకా బతికే ఉందని తెలియజేశారు. ఈ సిరీస్‌ విషాదంగా ముగిసింది. చూసే జనాల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది.

చివరికి హీరో తన పోరాటాన్ని కొనసాగిస్తాడా? ప్రాణాంతక గేమ్ కు నిజంగా ముగింపు పడిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మీరు స్క్విడ్ గేమ్ సీజన్ 3 చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.