
ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తుతున్న స్క్విడ్ గేమ్ సీజన్ 3 నేడు విడుదలైంది. ప్రత్యేకంగా, మొదటి ఎపిసోడ్‌లోని 6 నిమిషాలను ముందుగానే విడుదల చేయడం జరిగింది. 456వ ప్లేయర్ తిరిగి రావడం ఈ సీజన్‌లోని ముఖ్య అంశం.
Key Points
స్క్విడ్ గేమ్ సీజన్ 3 రిలీజ్ అయింది!
మొదటి ఎపిసోడ్‌లోని 6 నిమిషాలు ముందుగానే స్ట్రీమింగ్!
మరింత ఉత్కంఠభరితమైన ఆటలు ఈ సీజన్‌లో!
ముందుగానే 6 నిమిషాలు స్ట్రీమింగ్
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, క్షణక్షణం ఉత్కంఠను పంచే వెబ్ సిరీస్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. అందరూ అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఈ రోజు (జూన్ 27) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కు ముందు మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ లోని తొలి 6 నిమిషాలను ముందుగానే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో ఇది స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
స్క్విడ్ గేమ్ పోటీదారులను షాక్ కు గురి చేసేలా.. 456వ ప్లేయర్ గి హున్ (లీ జంగ్-జే) బతికే ఉన్నాడని వెల్లడించారు. 456వ ప్లేయర్ పునర్జన్మ పొందాడు. నెట్‌ఫ్లిక్స్ ట్యూడమ్ పంచుకున్న వీడియోలో 456వ ప్లేయర్ బాక్స్ లో నుంచి లేచి నిలబడటం చూపించారు. గత సీజన్‌లో తన సన్నిహిత స్నేహితుడిని కోల్పోయిన తర్వాత, అతను ఫ్రంట్ మ్యాన్‌ను సవాలు చేశాడు. మిగిలిన వాళ్ల కోసం మేల్కొని, బాధపడుతుంటాడు. అతను గార్డులను తనను చంపమని కూడా వేడుకుంటాడు.
456వ ప్లేయర్ తిరిగి రావడం
స్క్విడ్ గేమ్ సీజన్ 3లో ప్లేయర్ 456 తిరిగి రావడంపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. స్క్విడ్ గేమ్ సృష్టించిన దర్శకుడు హ్వాంగ్ డోంగ్-హ్యుక్ మాట్లాడుతూ.. “ఫ్రంట్ మ్యాన్ కోసం గి-హున్‌ను చంపడానికి బదులుగా ఆటకు తిరిగి పంపడం సమంజసం. అతను.. గి-హున్ తన స్వంత తప్పులకు చెల్లించే మూల్యాన్ని అనుభవించి అర్థం చేసుకోవాలని కోరుకుంటాడు. ఫ్రంట్ మ్యాన్ గి-హున్ మానవత్వంపై అలాగే తనపై ఉన్న నమ్మకాన్ని చివరికి వదులుకునే స్థితికి చేరుకోవాలని కోరుకుంటాడు. గి-హున్ ఆటకు తిరిగి రావడం ఫ్రంట్ మ్యాన్‌కు చాలా ముఖ్యం” అని పేర్కొన్నాడు.
సీజన్ 3 హైలైట్స్
నటుడు లీ జంగ్-జే ఈ క్షణం గురించి మాట్లాడుతూ.. “పెట్టె తెరిచినప్పుడు గి-హున్ పునర్జన్మ పొందుతాడు. అతను పోటీకి తిరిగి వెళ్ళాలి. మళ్ళీ ఆట ఆడాలి. మళ్ళీ ఎంపికలు చేసుకోవాలి” అని అన్నాడు. సీజన్ 3 స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ చివరి భాగం. ఇందులో ఆట ప్రమాదాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. మొదటి సీజన్ నెట్‌ఫ్లిక్స్ లో అత్యధికంగా చూసిన సిరీస్‌లలో ఒకటిగా మారింది. ఆరు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులతో సహా అనేక ప్రశంసలు పొందింది. సీజన్ 3 ఈ శుక్రవారం, జూన్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతోంది.
స్క్విడ్ గేమ్ సీజన్ 3 మరింత ఉత్కంఠభరితమైన ఎపిసోడ్లతో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది. 456వ ప్లేయర్ యొక్క తిరిగి రాక ఆసక్తిని రేకెత్తిస్తుంది.


