|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లి కూతురి గెటప్‌లో శ్రీలీల.. ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటోస్.. సెలబ్రేషన్స్ అంటూ పోస్ట్

Published: 01-06-2025, 3:01 AM
పెళ్లి కూతురి గెటప్‌లో శ్రీలీల.. ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటోస్.. సెలబ్రేషన్స్ అంటూ పోస్ట్

టాలీవుడ్ నటి శ్రీలీల తన ప్రీ-బర్త్‌డే వేడుకలను ఘనంగా జరుపుకుంది. పెళ్లి కూతురిలా అలంకరించబడిన శ్రీలీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Key Points

1

శ్రీలీల తన ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకుంది.

2

పెళ్లి కూతురి అలంకరణలో శ్రీలీల అందంగా కనిపించింది.

4

అభిమానులు శ్రీలీల ఫోటోలకు పలకరించారు.

శ్రీలీల ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్స్

‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) నటిస్తున్న ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. అయితే, ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఫోటో పెట్టి అభిమానులను అవాక్కయ్యేలా చేసింది. శ్రీ లీలకు ఆమె కుటుంబ సభ్యులు పసుపు, గంధం పెడుతున్న ఫొటోను తన స్టోరీగా పెట్టి.. కమింగ్ సూన్ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చింది. దీంతో శ్రీ లీల ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతుందా అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే.. శ్రీలీల ఇంట ఆమె ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.

పెళ్లి కూతురి గెటప్‌లో శ్రీలీల

తన తల్లి కోరిక మేరకు ఈ ప్రీ-బర్త్ డే వేడుకను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. పెళ్లి కూతుర్ని చేసిన విధంగా శ్రీలీలను కూడా పసుపు స్నానాలతో అలంకరించి, ఆమెను బుట్టలో తీసుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన పిక్స్ ఆమె తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె పెళ్లికి సంబంధించి ఏదైనా వార్త చెబుతుందని అనుకున్నవారికి ఈ బ్యూటీ మామూలు ట్విస్టు ఇవ్వలేదుగా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఫోటోలు

A post shared by Sreeleela (@sreeleela14)

శ్రీలీల ప్రీ-బర్త్‌డే వేడుకలు అభిమానులను ఆకట్టుకున్నాయి. పెళ్లి కూతురి గెటప్‌లో ఆమె అందం అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.