|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీలీల సీరియస్ లుక్: జబర్దస్త్ మహేష్‌తో అసలేం జరిగింది? వైరల్ వీడియో కలకలం!

Published: 16-03-2026, 9:05 AM
శ్రీలీల సీరియస్ లుక్: జబర్దస్త్ మహేష్‌తో అసలేం జరిగింది? వైరల్ వీడియో కలకలం!
  • ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 19, 2026న విడుదల కానుంది.
  • ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల, మహేష్‌ల మధ్య జరిగిన సంఘటన వైరల్ అయింది.
  • మహేష్ ఫోన్ వాడుతున్నాడని, అందుకే శ్రీలీల అలా చూసిందని నెటిజన్లు అంటున్నారు.
  • శ్రీలీల ఫోన్ గురించే చూసిందని మహేష్ వివరణ ఇచ్చాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల జబర్దస్త్ మహేష్ వైపు సీరియస్ గా చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో చూద్దాం.

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్‌లో శ్రీలీల

Sreeleela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత సినిమా గురించి సోషల్ మీడియాలో మరింత చర్చ మొదలైంది. ఇదే సమయంలో హీరోయిన్ శ్రీలీలకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.

ఆ వైరల్ వీడియోలో శ్రీలీల వెనక్కి తిరిగి నటుడు మహేష్ అచంటను కొంచెం సీరియస్‌గా చూసినట్టు కనిపిస్తోంది. మొదట మహేష్ అచంట ఆమె వైపు చూసి నవ్వుతాడు. కానీ కొద్దిసేపటికి అతను నిశ్శబ్దంగా నిలబడి పోతాడు. ఈ సంఘటనను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

వైరల్ వీడియోలో అసలు విషయం ఏంటి?

?igsh=MWduNWU0ZmU2M28zMw==

కొంతమంది నెటిజన్లు చెబుతున్నదేమిటంటే, పవన్ కళ్యాణ్ స్టేజ్‌పై సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో మహేష్ అచంట తన ఫోన్‌ను సౌండ్‌తో ఉపయోగిస్తున్నాడట. అందుకే శ్రీలీల అతనిని తిరిగి చూసిందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం మహేష్ అచంట దగ్గర శ్రీలీల ఫోన్ ఉండడంతో ఆమె తిరిగి చూసిందేమో అని అంటున్నారు.

ఈ క్రమంలో మహేష్ అచంట అసలు ఏం జరిగింది అన్న విషయం బయటపెట్టారు. అంతకుముందే శ్రీ లీల తనకు ఫోన్ ఇచ్చిందని.. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫోన్ కోసం చూసింది అనుకున్నానని.. కానీ.. తను చూసింది.. స్క్రీన్ వైపు అని తర్వాత అర్థమైంది అని పెట్టారు. అంతేకాదు ఎవరిని అలా అమర్యాద గా మాట్లాడొద్దండి అని కూడా తన ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో షేర్ చేస్తూ కింద క్యాప్షన్ లో పెట్టుకోచ్చారు.

మహేష్ అచంట క్లారిటీ

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్‌లో జరిగిన ఈ చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్‌గా మారింది. శ్రీలీల ఈ విషయంపై స్పందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్‌లో జరిగిన ఈ చిన్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ చిత్రం మార్చి 19, 2026న విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.