
📌 Key Points
- శ్రీలీల ధనుష్ 55వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు అధికారిక ప్రకటన.
- వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది.
- రాజ్ కుమార్ పెరియస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
- తెలుగులో ఆశించిన విజయాలు రాకపోవడంతో కోలీవుడ్‌పై శ్రీలీల దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల కోలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో శ్రీలీల టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసినట్లేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ధనుష్ సినిమాలో శ్రీలీల.. అధికారిక ప్రకటన!
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చి కోలీవుడ్ ఇండస్ట్రిపై ఫోకస్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే ఈమె శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమా ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోనే మరో స్టార్ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ధనుష్(Danush) హీరోగా నటిస్తున్న తన 55వ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించబోతున్నట్లు నిర్మాతలు అధికారకంగా తెలియజేశారు. ఇలా శ్రీలీల ధనుష్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ “మీరు ఇది ఊహించి ఉండరు కదా” అంటూ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ విడుదల చేసిన పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధనుష్ తన సినీ కెరియర్ లో 55వ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు అమరన్ సినిమా డైరెక్టర్ రాజకుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. అమరన్ సినిమా తర్వాత ఈయన ధనుష్ తో సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ధనుష్ లాంటి స్టార్ హీరో సినిమాలో శ్రీ లీల నటించే అవకాశాన్ని అందుకోవడంతో ఈమె అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది? ఇందులో శ్రీ లీల ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే విషయాల గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన శ్రీలీల
ఇలా తమిళంలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల రెండో సినిమానే మరో స్టార్ హీరోతో చేసే అవకాశాన్ని అందుకోవడం చూస్తుంటే ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెబుతూ తమిళ చిత్ర పరిశ్రమలోనే సెటిల్ అవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ 55 సినిమాకు సంబంధించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈమె కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో నటించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అజిత్ సినిమాలో కాకుండా ధనుష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసారని తెలుస్తుంది.
శ్రీ లీల తెలుగు సినిమాల విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఈమె తెలుగులో నటించిన సినిమాలన్నీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పూర్తిగా నిరాశ పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల పై ఫోకస్ చేశారు. తెలుగులో ఈమె చివరిగా రవితేజతో కలిసి మాస్ జాతర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం శ్రీ లీల ఎలాంటి తెలుగు సినిమాలకు కమిట్ అవ్వలేదు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.
టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసినట్టేనా?
మొత్తానికి శ్రీలీల కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో శ్రీలీలకు ఎలాంటి విజయం దక్కుతుందో.


