|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీలీల ప్రేమాయణం: తిలక్ వర్మతో గుట్టుగా వ్యవహారం? షాకింగ్ నిజాలు వైరల్!

Published: 17-05-2026, 6:00 AM
శ్రీలీల ప్రేమాయణం: తిలక్ వర్మతో గుట్టుగా వ్యవహారం? షాకింగ్ నిజాలు వైరల్!
  • శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ దాదాపు ఏడాదిగా రహస్య ప్రేమలో ఉన్నారని గుసగుసలు.
  • వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో ఇద్దరూ కుటుంబాలతో కలిసి కనిపించడం చర్చనీయాంశం.
  • ముంబై IPL మ్యాచ్‌కి శ్రీలీల హాజరు, తిలక్ వర్మ జెర్సీతో సన్నిహితుడు.
  • తిలక్ వర్మ స్నేహితులు ప్రేమలో ఉన్నాడని చెప్పడం రూమర్లకు బలం.

టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రేమాయణంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది. ఓ టీమ్ ఇండియా క్రికెటర్ తో ఆమె బంధంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సంచలన వ్యవహారంపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

శ్రీలీల – తిలక్ వర్మ ప్రేమాయణం: అసలు నిజం ఏంటి?

Sreeleela : గత కొన్ని రోజుల క్రితం వరకు హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉందని, వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కార్తీక్ ఆర్యన్ తల్లి మా కోడలు డాక్టర్ అని చెప్పడంతో శ్రీలీల – కార్తీక్ రిలేషన్ ని ఫిక్స్ అయిపోయారు అంతా. అయితే తాజాగా శ్రీలీల రిలేషన్ గురించి కొత్త రూమర్ వినిపిస్తుంది.

శ్రీలీల ఓ టీమ్ ఇండియా క్రికెటర్ తో ప్రేమలో ఉందని సమాచారం. ఆ క్రికెటర్ ఎవరో కాదు మన తెలుగబ్బాయి తిలక్ వర్మ అంట. తిలక్ వర్మతో శ్రీలీల దాదాపు ఏడాది నుంచి ప్రేమలో ఉందట.

తిరుమల నుండి ముంబై వరకు.. ప్రేమ సాక్ష్యాలు!

గత వైకుంఠ ఏకాదశి నాడు శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమల వెళ్లగా అదే రోజు అదే సమయానికి తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో తిరుమల వచ్చాడు. ఇటీవల IPL లో శ్రీలీల తల్లి ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఫ్యామిలీతో కలిసి కనిపించిందట. అలాగే ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్‌కి శ్రీలీల హాజరవగా తనతో పాటు ఉన్న ఓ వ్యక్తి తిలక్ వర్మ జెర్సీ ధరించాడట.

కెరీర్ పై ప్రభావం.. శ్రీలీల భవిష్యత్తు ఏంటి?

ఇటీవల తిలక్ వర్మ ఫ్రెండ్స్ మాట్లాడుతూ అతను ప్రేమలో ఉన్నాడని మీడియాతో చెప్పారు. ఇలా పలు సంఘటనలతో శ్రీలీల – తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి శ్రీలీల లేదా తిలక్ వర్మ దీనిపై స్పందిస్తారా లేదా చూడాలి. ఇక మొదట్లో హీరోయిన్ గా హిట్స్ కొట్టిన శ్రీలీల ఆ తర్వాత అన్ని ఫ్లాప్స్ చూసింది. మధ్యలో గుంటూరు కారం సినిమా పర్వాలేదనిపించినా మళ్ళీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఓ హిందీ సినిమా, ఓ తమిళ్ సినిమా ఉన్నాయి. తెలుగులో వరుస సినిమాలు చేసిన శ్రీలీలకు ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

శ్రీలీల, తిలక్ వర్మల ప్రేమాయణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే, టాలీవుడ్, క్రికెట్ ప్రపంచంలో ఇది పెద్ద సంచలనమే అవుతుంది. మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.