
దర్శకుడు శ్రీనువైట్ల తన గత సినిమా పరాజయం తరువాత కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు శర్వా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Key Points
శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా కొత్త సినిమా రాబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
శర్వానంద్‌కు శ్రీనువైట్ల చెప్పిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
శర్వా ప్రస్తుతం 'భోగి', 'బైకర్' షూటింగ్‌లతో పాటు 'నారి నారి నడుమ మురారి' రిలీజ్‌కు సిద్ధమవుతున్నాడు.
శ్రీనువైట్ల – శర్వానంద్ కాంబినేషన్ ఖాయం
ఈ మధ్యకాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ అయితే లేదు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘విశ్వం’ (2024) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో ఆయన కాస్త సమయం తీసుకొని.. ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో శర్వా హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త చిత్రం
ఇప్పటికీ శర్వాకి శ్రీను వైట్ల కథ వినిపించారట. శ్రీను వైట్ల మార్క్‌తో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా కథ శర్వానంద్‌కు నచ్చిందని సమాచారం. దీంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట శర్వా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని భోగట్టా.
శర్వానంద్ ప్రస్తుతం బిజీగా ఉన్న ప్రాజెక్టులు
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమా నిర్మించనున్నారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ టాక్. మరోవైపు ప్రస్తుతం ‘భోగి’, ‘బైకర్’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి రిలీజ్‌కు ముస్తాబవుతోంది.
శ్రీనువైట్ల, శర్వానంద్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. శర్వానంద్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి.


