|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లక్ అంటే శ్రీ విష్ణుదే.. ఐపీఎల్ సస్పెండ్, వీకెండ్.. సింగిల్ మూవీ కలెక్షన్ల జోరు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Published: 12-05-2025, 12:43 AM
లక్ అంటే శ్రీ విష్ణుదే.. ఐపీఎల్ సస్పెండ్, వీకెండ్.. సింగిల్ మూవీ కలెక్షన్ల జోరు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Key Points

1

శ్రీ విష్ణు 'సింగిల్' మూవీ 3 రోజుల్లో రూ.14.5 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.

2

ఐపీఎల్ సస్పెన్షన్ మరియు వీకెండ్ సినిమా కలెక్షన్లకు దోహదపడ్డాయి.

3

మూడో రోజు ఆక్యుపెన్సీ 50% కంటే ఎక్కువగా నమోదైంది.

‘సింగిల్’ మూవీ కలెక్షన్ల జోరు

తనదైన కామెడీ టైమింగ్ తో, పంచ్ డైలాగ్ లతో, మీమ్స్ రీ క్రియేషన్ తో ఫ్యాన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్న హీరో శ్రీ విష్ణు మరో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆయన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ థియేటర్లలో అదరగొడుతోంది. ఈ కామెడీ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. ఈ మూవీ లాభాల్లోకి దూసుకెళ్లనుంది.

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన కొత్త సినిమా ‘ సింగిల్ ’ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిందనే చెప్పొచ్చు. ఈ మూవీని దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూను రూ.7 కోట్లుగా తేల్చారు. ఇప్పుడు థియేటర్లలో ఈ మూవీ మూడు రోజుల్లో రూ.14.5 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఐపీఎల్ సస్పెన్షన్ ప్రభావం

భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 ను సస్పెండ్ చేయడం, వీకెండ్ విష్ణు సినిమా ‘సింగిల్’ కలెక్షన్లకు కలిసొచ్చింది. మూడో రోజైన ఆదివారం (మే 11) ఫస్ట్ షో, సెకండ్ షో ఆక్యుపెన్సీ పెరిగింది. 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైంది. దీంతో ఈ మూవీ మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3.6 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టినట్లు తెలిసింది.

సింగిల్ మూవీ మూడు రోజుల గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రూ.15.9 కోట్లుగా ఉన్నాయి. మూడో రోజు గ్రాస్ కలక్షన్లు రూ.6 కోట్లు అయిన ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది డే1 (రూ.4.1 కోట్లు), డే2 (రూ.5.8 కోట్లు) కంటే ఎక్కువ కావడం విశేషం.

మూడో రోజు ఆక్యుపెన్సీ

ఇండియాలో చూసుకుంటే ‘సింగిల్’ మూవీ మూడు రోజుల్లో రూ.9.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. మూడో రోజు రూ.3.50 కోట్లు వచ్చాయని పేర్కొంది. దీంతో శ్రీవిష్ణుకు మరో బ్లాక్ బస్టర్ దక్కినట్లే. వరుసగా థియేటర్లలో కలెక్షన్ల జోరు కొనసాగిస్తున్నారు విష్ణు.

సింగిల్ మూవీలో శ్రీ విష్ణుతో ఇద్దరు ముద్దుగుమ్మలు కేతికా శర్మ, ఇవానా రొమాన్స్ చేశారు. హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తే.. అతణ్ని ఇంకో అమ్మాయి ప్రేమిస్తుంది. ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ కామెడీ రొమాంటిక్ స్టోరీగా వచ్చిన సింగిల్ ఆడియన్స్ ను నవ్విస్తోంది. కార్తీక్ రాజు ఈ మూవీకి డైరెక్టర్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీలో వెన్నెల కిశోర్ కీ రోల్ ప్లే చేశారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా స్క్రీన్లలో ఈ మూవీ రిలీజైంది.

మొత్తంమీద, ‘సింగిల్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఐపీఎల్ సస్పెన్షన్ మరియు వీకెండ్ కూడా దీనికి కారణమని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.