
📌 Key Points
- శ్రీదేవి ఆస్తి వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరడంతో ఉత్కంఠ నెలకొంది.
- బోనీకపూర్ కుటుంబం తమ ఆస్తిని అక్రమంగా అనుభవిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసింది.
- చెంగల్పట్టులోని 4.7 ఎకరాల స్థలంపై దావాను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేయబడింది.
- స్థానిక కోర్టులో జరుగుతున్న చర్చలపై కోర్టు తాత్కాలిక స్టే విధించింది.
దివంగత నటి శ్రీదేవి ఆస్తి వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరడంతో మరో మలుపు తిరిగింది. బోనీకపూర్ మరియు ఆయన కుమార్తెలు తమ ఆస్తిని కొందరు అక్రమంగా అనుభవిస్తున్నారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
మద్రాస్ హైకోర్టుకు చేరిన ఆస్తి వివాదం
Sridevi:బాలీవుడ్ ను మొదలుకొని టాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో, నటనతో మెప్పించి అతిలోకసుందరిగా పేరు సొంతం చేసుకున్న దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి వంటి అగ్రతారలతో మెరిసిన ఈమె అనూహ్యంగా దుబాయ్ లో మరణించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఆమె మరణించి ఇన్నేళ్లయినా ..ఆమె ఆస్తి వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం కాస్త ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు చేరింది. ఇక దీంతో అందరి చూపు మద్రాస్ హైకోర్టు ఇచ్చే తుది తీర్పు పైనే ఉంది. న్యాయం ఎవరికి జరుగుతుంది? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే.. శ్రీదేవి భర్త ప్రముఖ నిర్మాత బోనీకపూర్ తో పాటు వారి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఆస్తిని కొంతమంది అక్రమంగా అనుభవిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు బోనీ కపూర్. ఈ విషయాన్ని పరిశీలించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను మార్చి 26 2026 కి వాయిదా వేసింది.
బోనీకపూర్ కుటుంబం పిటిషన్
పూర్తి వివరాలలోకి వెళ్తే.. చెంగల్పట్టులోని సుమారు 4.7 ఎకరాల స్థలంపై హక్కుల కోసం ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన సివిల్ దావాను కొట్టివేయాలని కోరుతూ బోనీకపూర్ కుటుంబం జాయింట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను విచారించిన జస్టిస్ టీవీ తమిళ్ సెల్వి నేతృత్వంలోని ధర్మస్థానం స్థానిక కోర్టులో జరుగుతున్న చర్చలపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో బోనీకపూర్ కుటుంబానికి ఊరట లభించినట్లయింది.
అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అనే విషయానికొస్తే.. 1998లో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ఈ విలువైన ఆస్తిని ఏప్రిల్ 19 1988న శ్రీదేవి చట్టబద్ధంగా కొనుగోలు చేసింది ..ఈ భూమికి అసలైన యజమాని ఎంసీ సంబంధ ముదలియార్. ఆయన కుటుంబ సభ్యుల మధ్య 1960లో జరిగిన ఆస్తి పంపకాల ఒప్పందం ప్రకారమే.. శ్రీదేవి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటినుండి ఈ ఆస్తి ఆమె కుటుంబం ఆధీనంలోనే ఉంది. కానీ మొదలియార్ వారసులమంటూ ఏకంగా ముగ్గురు వ్యక్తులు ఈ ఆస్తిపై హక్కులు కోరుతూ వివాదం సృష్టించారు.
వివాదానికి కారణమైన ఆస్తి వివరాలు
పైగా 2005లో తాంబరం తహసీల్దారు నుండి వారసత్వ ధృవపత్రాన్ని కూడా పొందారు. కానీ మొదలియార్ కుటుంబం అసలు తాంబరంలో నివసించలేదని.. మైలాపూర్ లో ఉండే వారిని బోనీకపూర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారసులమని చెప్పుకుంటున్న వారిలో ఒకరు ముదలియార్ కుమారుడి రెండో భార్య అని క్లైమ్ చేసారు..కానీ మొదటి భార్య బతికి ఉండగానే జరిగిన ఈ వివాహం చట్టబద్ధం కాదని, హిందూ వారసత్వ చట్ట ప్రకారం వారికి ఆస్తిలో వాటా ఉండదని బోనీకపూర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఆ ముగ్గురు వ్యక్తుల పేరుతో ఉన్న మోసపూరిత పత్రాలను రద్దు చేయాలని ఆదేశించారు. దీనిపై నాలుగు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసిల్దార్ కి కూడా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.ఇక అందుకే మోసపూరిత పత్రాలతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోనీకపూర్ కుటుంబం కోరుతోంది. మార్చి 26న తుది విచారణ జరగనుంది. వచ్చే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మొత్తానికి శ్రీదేవి ఆస్తి వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరడం, బోనీకపూర్ కుటుంబం పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. కోర్టు తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.


