|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీకాళహస్తిలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కు ప్రైవేట్ పూజలు.. ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు

Published: 31-05-2025, 10:47 AM
శ్రీకాళహస్తిలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కు ప్రైవేట్ పూజలు.. ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుటుంబం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించింది. అక్కడ వారికి ప్రైవేట్ పూజలు జరిగాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విచారణ జరిగింది.

Key Points

1

శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు జరిగాయి.

2

ఈ పూజల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

4

ప్రైవేట్ పూజలు చేయించిన వేద పండితుడిని సస్పెండ్ చేశారు.

శ్రీకాంత్ కుటుంబానికి ప్రత్యేక పూజలు

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ (hero Srikanth) ఫ్యామిలీ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి (Srikalahasti)లో పర్యటించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి ఆలయంలో ఓ అర్చకుడు ప్రత్యేక పూజలు (Special Pujas) నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైసీపీ నేతలు ఆలయ అధికారుల (temple authorities) తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సాధారణ భక్తులకు తిప్పలు వీఐపీలకు ప్రత్యేక పూజలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా ఈ ఘటన శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ నెల 29 జరిగింది.

హీరో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు.. మఠంలో నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. 29న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు.. శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేకంగా చేయించారనే వార్తలపై విచారణకు ఆదేశించారు. అనంతరం విచారణలో ఓ వేద పండితుడు (Vedic scholar) ఈ ప్రైవేటు పూజలు చేయించినట్లు గుర్తించిన అధికారులు ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ (Suspension) వేటు వేశారు. అలాగే ఇకపై ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే.. ఎండోమెంట్ యాక్టు (Endowment Act) ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఈవో (EO) హెచ్చరికలు జారీ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ వీడియో

వేద పండితుడిపై సస్పెన్షన్

శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన ఈ ఘటనతో ఆలయ అధికారులు అప్రమత్తమై, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎండోమెంట్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.