|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీముఖి నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. 12 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఇక్కడ చూసేయండి

Published: 16-09-2025, 11:00 AM
శ్రీముఖి నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. 12 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఇక్కడ చూసేయండి

2013లో విడుదలైన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా 12 ఏళ్ళ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీలో చూడవచ్చు.

Key Points

1

శ్రీముఖి నటించిన 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమా 12 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి!

2

సెప్టెంబర్ 18 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్.

4

శ్రీవిష్ణు, హర్షవర్ధన్ రాణే, రితికా షేరు తదితరులు నటించారు.

ప్రేమ ఇష్క్ కాదల్ ఓటీటీ రిలీజ్

ఓటీటీలోకి ఈవారం ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు ప్రేమ ఇష్క్ కాదల్. అప్పుడెప్పులో 2013లో థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. సుమారు 12 ఏళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం.

ప్రేమ ఇష్క్ కాదల్ ఓటీటీ రిలీజ్ డేట్

తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమ ఇష్క్ కాదల్ ఈ వారమే ఓటీటీ లోకి వస్తోంది. గురువారం (సెప్టెంబర్ 18) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది.

సినిమా కథాంశం మరియు నటీనటులు

“ప్రేమ, నవ్వులు, మరచిపోలేని జ్ఞాపకాలు వచ్చేస్తున్నాయి. ప్రేమ ఇష్క్ కాదల్ సెప్టెంబర్ 18 నుంచి కేవలం ఈటీవీ విన్ ఓటీటీలో” అంటూ సోమవారం (సెప్టెంబర్ 15) ట్వీట్ చేసింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే యప్ టీవీ, గూగుల్ ప్లేలలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు మెయిన్‌స్ట్రీమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి వస్తోంది.

ప్రేమ ఇష్క్ కాదల్ మూవీ గురించి..

ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ వివరాలు

పవన్ సాదినేని డైరెక్ట్ చేసిన ప్రేమ ఇష్క్ కాదల్ మూవీ డిసెంబర్ 6, 2013లో రిలీజైంది. ఇదొక ఆంథాలజీ రొమాంటిక్ కామెడీ మూవీ. మూడు వేర్వేరు లవ్ స్టోరీల సమాహారమే ఈ సినిమా. ఇందులో శ్రీవిష్ణుతోపాటు బాలీవుడ్ నటుడు హర్షవర్దన్ రాణే, హరీష్ వర్మ, రితికా షేరు, రీతూ వర్మ, శ్రీముఖిలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు ఐఎండీబీలో 6.6 రేటింగ్ ఉంది. హిందీ, తెలుగు, తమిళ లవ్ స్టోరీలను ఈ మూవీ చూపిస్తుంది.

అది కూడా మూడు విఫల ప్రేమ కథలు. ఇందులో రాయల్ రాజు అనే పాత్రలో శ్రీవిష్ణు, శాంతి అనే పాత్రలో శ్రీముఖి నటించారు. ఈ మధ్యే మిరాయ్ మూవీతో పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయడం విశేషం. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. మరి ఈ ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాకు ఈటీవీ విన్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మొత్తానికి, పాత సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఓటీటీలోకి రావడం సంతోషకరమైన విషయం. శ్రీముఖి అభిమానులకు ఇది గుడ్ న్యూస్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.