|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఈ నగరానికి ఏమైంది 2లో హీరో మార్పు! సుశాంత్ రెడ్డి అవుట్, శ్రీనాథ్ మాగంటి ఇన్!

Published: 23-01-2026, 5:35 AM
షాకింగ్: ఈ నగరానికి ఏమైంది 2లో హీరో మార్పు! సుశాంత్ రెడ్డి అవుట్, శ్రీనాథ్ మాగంటి ఇన్!
  • ఈ నగరానికి ఏమైంది 2లో కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి – సుశాంత్ రెడ్డి స్థానంలోకి ఎంట్రీ!
  • హిట్, యానిమల్ సినిమాలతో శ్రీనాథ్ మాగంటికి టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్, ఇప్పుడు మరో భారీ అవకాశం!
  • తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.
  • సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోవడంతో శ్రీనాథ్ మాగంటికి లక్కీ ఛాన్స్!

టాలీవుడ్లో ఒక సంచలనం! ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఊహించని మార్పు చోటుచేసుకుంది. కార్తీక్ పాత్రలో సుశాంత్ రెడ్డి స్థానంలో ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి నటించనున్నారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

సుశాంత్ రెడ్డి అవుట్.. శ్రీనాథ్ మాగంటి ఇన్!

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ చిత్రం నుంచి కార్తీక్ పాత్ర నటుడు మారిపోయిన విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు కార్తీక్ పాత్ర పోషించిన సుశాంత్ రెడ్డి ప్లేసులో మరో టాలెంటెడ్ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి నటించినున్నట్లు సమాచారం. శ్రీనాథ్ హిట్, యానిమల్ సినిమాలతో నటుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఈ నగరానికి ఏమైంది సినిమా టాలీవుడ్‌లో ఒక బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమాలోని నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిందే. ఆ ఫ్రెండ్స్ చేసిన అల్లరి, కామెడీ ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన చూడాలనిపిస్తుంది. అంతలా ఆ పాత్రలు ప్రతి ఫ్రెండ్షిప్ గ్యాంగ్‌ మనసుల్లో ముద్ర వేసుకున్నాయి.

హిట్, యానిమల్ సినిమాలతో శ్రీనాథ్ క్రేజ్

ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ నగరానికి ఏమైంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పంచుకున్నారు. సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఈ నగరానికి ఏమైంది 2 నుంచి వైదొలిగినట్లు తరుణ్ భాస్కర్ వివరించారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా ఆ కార్తీక్ పాత్రను ఎవరు చేస్తారు అనే క్యూరియాసిటీ నెలకొంది.

‘ హిట్ ‘ ఫ్రాంచైజీలో అభిలాష్ పాత్రలో శ్రీనాథ్ నటన పలు ప్రశంసలు అందుకుంది. ‘లక్కీ భాస్కర్’లోనూ సూరజ్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. ఆ సినిమాలో రష్మిక మందన్నా బ్రదర్ రోల్ చేశారు.

తరుణ్ భాస్కర్ రియల్ లైఫ్ స్టోరీ!

తరుణ్ భాస్కర్ జీవితంలో జరిగిన సంఘటనలు, స్నేహం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ‘ఈ నగరానికి ఏమైంది 2’ స్క్రిప్ట్ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రాశారు. అందులో శ్రీనాథ్ మాగంటి కార్తీక్ పాత్ర పాత్ర చేస్తున్నారు. అంటే, నలుగురు హీరోల్లో ఆయన కూడా ఒకరు.

మొత్తానికి ఈ నగరానికి ఏమైంది 2లో శ్రీనాథ్ మాగంటి ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.