|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sriram Venu: ‘తనే నా జీవితంలో మొదటి స్నేహితురాలు’.. తమ్ముడు డైరెక్టర్ భావోద్వేగం

Published: 01-07-2025, 6:47 AM
Sriram Venu: 'తనే నా జీవితంలో మొదటి స్నేహితురాలు'.. తమ్ముడు డైరెక్టర్ భావోద్వేగం

నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Key Points

1

నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా జూలై 04న విడుదల.

2

దర్శకుడు వేణు శ్రీరామ్ తన అక్కను తన మొదటి స్నేహితురాలని పేర్కొన్నారు.

4

వేణు శ్రీరామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.

తమ్ముడు సినిమా రిలీజ్ డేట్

తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో నితిన్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న లయ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో జూలై 04న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తమ్ముడు మూవీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు వేణు శ్రీరామ్ తన జర్నీ గురించి మాట్లాడారు.

తన జీవితంలో మొదటి స్నేహితురాలు అక్క ‍అని వేణు శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన తన సోదరిని అందరికీ పరిచయం చేశారు. నా జీవితంలో మొట్టమొదటి కెమెరా మా అక్కనే కొనిచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు తొందరగానే పెళ్లి అయిపోందన్నారు. నా మొదటి షార్ట్‌ ఫిలిం ఆ కెమెరాతోనే తీశానని వేణు శ్రీరామ్ వెల్లడించారు. మా అక్క  కష్టపడేతత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు.

వేణు శ్రీరామ్ – అక్కతో ఉన్న బంధం

సినిమా షూటింగ్ అనుభవం

వేణు శ్రీరామ్ తన అక్కతో ఉన్న అనుబంధం, ఆమె ఇచ్చిన కెమెరాతో తన సినీ ప్రయాణం ప్రారంభమైన విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు కూడా వెల్లడించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.