
టీమిండియా ఇంగ్లాండ్‌పై సాధించిన విజయంపై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సిరాజ్ మియా అద్భుతమైన బౌలింగ్‌ను ఆయన ప్రశంసించారు.
Key Points
రాజమౌళి టీమిండియా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.
సిరాజ్ మియా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ప్రసిద్ధ్ కృష్ణ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు.
రాజమౌళి ట్వీట్ వైరల్
టీమిండియా చివరి టెస్ట్ లో విజయం సాధించడంపై దర్శకధీరుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు . వాట్ ఏ స్పెల్ సిరాజ్ మియా అంటూ మహమ్మద్ సిరాజ్ పై ప్రశంసలు కురిపించారు . అలాగే ప్రసిధ్ కృష్ణను సైతం కొనియాడారు . ఓవల్ లో టీమిండియా తిరిగి పుంజుకుని అద్భుతంగా పోరాడిందని ప్రశంసలు కురిపించారు . టెస్ట్ క్రికెట్ కు మరేది సాటిరాదని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు . ప్రస్తుతం రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
సిరాజ్ మియా అద్భుత బౌలింగ్
కాగా .. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సంచలన విజయం సాధించింది . చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో మనోళ్లు విజయకేతనం ఎగరేశారు . సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు . ఐదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు . ప్రసిధ్ కృష్ణ సైతం నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు . ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 2-2 తో డ్రాగా ముగిసింది .
రాజమౌళి తదుపరి సినిమా
ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేశ్ బాబు మూవీతో బిజీగా ఉన్నారు . వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది . ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది . వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .
చివరగా, రాజమౌళి ప్రశంసలు సిరాజ్ మియా మరియు టీమిండియాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయన సినిమా కెరీర్ కూడా శిఖరాలను అందుకుంటోంది.


