
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మరియు మహేశ్ బాబు ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరూ వీడియో సందేశాల ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమౌళి-మహేశ్ బాబు కాంబో చిత్రంపై అభిమానుల ఆసక్తి పెరిగింది.
Key Points
ప్రధాని మోదీ పుట్టినరోజుకు రాజమౌళి శుభాకాంక్షలు
75 ఏళ్ల వయసులోనూ చురుకుగా ఉన్న మోదీని రాజమౌళి ప్రశంసించారు
మహేశ్ బాబు కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
రాజమౌళి, మహేశ్ బాబు కాంబో చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి
రాజమౌళి, మోదీకి శుభాకాంక్షలు
మనదేశ ప్రధాని నరేంద్రమోదీకి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విషెస్ తెలిపారు . ఇవాళ మోదీ బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు . 75 ఏళ్ల వయసులోనూ మీరు 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నారని ప్రశంసించారు . ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు . వరల్డ్ వైడ్ గా బలమైన స్థానంలో నిలబెట్టారని కొనియాడారు . మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శక్తి , ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నానని వీడియోను పోస్ట్ చేశారు.
మహేశ్ బాబు శుభాకాంక్షలు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . మీ నిబద్ధత , జీవితం గురించి చూస్తే రాబోయే తరాలకు ఆదర్శమని కొనియాడారు . దేశం కోసం మీరు చేస్తున్న కృషి ప్రతి భారతీయుడని గర్వపడేలా చేసిందన్నారు . మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని .. మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాని వీడియో రిలీజ్ చేశారు .
రాజమౌళి-మహేశ్ బాబు సినిమా
కాగా .. మహేశ్ బాబు – రాజమౌళి కాంబోలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి . తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది . ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.
మొత్తంగా, ప్రముఖుల నుండి ప్రధాని మోదీకి వచ్చిన శుభాకాంక్షలు ఆయనకు మరింత స్ఫూర్తినివ్వడంతో పాటు, రాజమౌళి-మహేశ్ బాబు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.


