|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SSMB 29: జక్కన్న మూవీలో మహేష్ రోల్ ఇదే.. స్టోరీ లైన్ లీక్ !

Published: 03-05-2025, 6:21 AM
SSMB 29: జక్కన్న మూవీలో మహేష్ రోల్ ఇదే.. స్టోరీ లైన్ లీక్ !

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వెలువడ్డాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఏ పాత్రలో నటిస్తున్నారో, ఎక్కడ షూటింగ్ జరుగుతోందో తెలుసుకుందాం.

Key Points

1

మహేష్ బాబు SSMB29 లో ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

2

సినిమాలో మహేష్ బాబు కామెడీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

4

వారణాసిలో జూన్ 10 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.

మహేష్ బాబు పాత్ర వివరాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో… ఇప్పుడు అందరి చూపు రాజమౌళి ( SS Rajamouli) అలాగే మహేష్ బాబు ( Mahesh Babu) సినిమా పైనే ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు 29వ సినిమాను ( SSMB29 ) జక్కన్న చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య సినిమా అంటేనే… చాలా స్పెషల్. ఇక ఈ సినిమా బిజీలో ఇప్పటికే జక్కన్న పడిపోయారు. అటు మహేష్ బాబు కూడా కొత్త హెయిర్ స్టైల్ తో… సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో ఆర్కియాలజిస్ట్ గా ( archaeologist) ప్రిన్స్ మహేష్ బాబు కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మహేష్ బాబును రెడీ చేస్తున్నారట జక్కన్న. ఆర్కియాలజిస్ట్ పాత్రలో మహేష్ బాబు కనిపించడమే కాకుండా కామెడీ కూడా బాగా పండించబోతున్నారట. అన్ని సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ సినిమాలో ఎక్కువ కామెడీని పెట్టేందుకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

షూటింగ్ ప్రదేశాలు

ఇక ఈ సినిమాను హైదరాబాద్ తో పాటు వారణాసిలో కూడా… తీయబోతున్నారట. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన సెట్ కూడా రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారణాసిలో జూన్ 10వ తేదీ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

సినిమా విశేషాలు

Exclusive – #SSMB29 🔥 #MaheshBabu as smart archaeologist in #SSMB29 🔥 ! pic.twitter.com/vW4n7V71ck

మొత్తం మీద, SSMB29 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ బాబు కొత్త అవతారం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.