|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా.. సెట్ వేస్తే అదే పెట్టేస్తారా..

Published: 09-10-2025, 7:11 AM
SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా.. సెట్ వేస్తే అదే పెట్టేస్తారా..

మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా టైటిల్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి నవంబర్‌లో అప్‌డేట్ రానుంది. కాగా, ప్రస్తుతం ‘వారణాసి’ అనే టైటిల్ వైరల్ అవుతుండగా, దీనిపై మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.

Key Points

1

SSMB 29 నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

2

నవంబర్‌లో సినిమా అప్‌డేట్ వస్తుందని మహేష్ పుట్టిన రోజున ప్రకటించారు.

4

రూ.50 కోట్లతో హైదరాబాద్‌లో కాశీ సెట్ వేస్తున్నారు.

SSMB 29 షూటింగ్ అప్‌డేట్స్

SSMB 29 : మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరుపుకుంది. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి రీ రిలీజ్ పనుల్లో ఉండటంతో ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి అప్డేట్ నవంబర్ లో ఇస్తామని మహేష్ పుట్టిన రోజున ప్రకటించారు.(SSMB 29)

గ్లోబల్ అడ్వెంచరస్ డ్రామాగా చిన్న మైథలాజికల్ టచ్ తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఒరిస్సా కోరాపుట్ అడవులు, కెన్యా, టాంజానియా అడవుల్లో జరిగింది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కాశీ సెట్ భారీగా 50 కోట్లతో వేస్తున్నారు. బాహుబలి రీ రిలీజ్ తర్వాత ఆ సెట్ లోనే మహేష్ – రాజమౌళి సినిమా షాట్ జరగనుందని సమాచారం.

వారణాసి: రూమర్డ్ టైటిల్ వెనుక కథ

Also See : Sobhita Dhulipala : బ్లాక్ డ్రెస్ లో శోభిత ధూళిపాళ బ్యూటీ..

తాజాగా మహేష్ – రాజమౌళి సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ రూమర్స్ ప్రకారం మహేష్ బాబు – రాజమౌళి సినిమా టైటిల్ ‘వారణాసి’ అని తెలుస్తుంది. వారణాసి అనేది కాశీకి మరో పేరు. ఆ ఊరు బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువగా ఈ కథ జరుగుతుందట. అందుకే దాన్నే టైటిల్ గా అనుకుంటున్నారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

టైటిల్‌పై అభిమానుల అంచనాలు

ఈ సినిమా కోసం అంత పెద్ద సెట్ వేస్తున్నారని, సినిమా కథ ఆ సిటీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని అందుకే ఆ టైటిల్ పెడతారా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలే ఇటీవల రిలీజ్ చేసిన ఓ పోస్టర్ లో మహేష్ మెడలో శివుడి త్రిశూలం, నంది, ఢమరుకం, శివ నామాలు.. ఉన్న చైన్ వేసుకున్నాడు. మరి అధికారికంగా ఈ సినిమా టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారో, నవంబర్ లో ఈ సినిమా అప్డేట్ ఏమిస్తారో చూడాలి.

మహేష్-రాజమౌళి సినిమా టైటిల్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ‘వారణాసి’ అనే టైటిల్ ఎంతవరకు నిజం, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. నవంబర్‌లో రానున్న అప్‌డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.