|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SSMB29: ఫ్యాన్స్ సందేహాలకు ఎండ్ కార్డ్.. మూడు నిమిషాల వీడియో రిలీజ్

Published: 15-11-2025, 5:45 AM
SSMB29: ఫ్యాన్స్ సందేహాలకు ఎండ్ కార్డ్.. మూడు నిమిషాల వీడియో రిలీజ్

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో రానున్న ‘SSMB29’ సినిమా టైటిల్, థీమ్ వీడియో రిలీజ్‌పై అభిమానుల సందేహాలకు తెరపడింది. ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో మూడు నిమిషాల నిడివి గల ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్లు రాజమౌళి స్వయంగా ప్రకటించారు.

Key Points

1

రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' సినిమా టైటిల్ 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో రిలీజ్.

2

మూవీ థీమ్‌ను వివరించే మూడు నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేయనున్నారు.

4

పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా లుక్స్ వచ్చినా, మహేశ్ బాబు లుక్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

SSMB29: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ విశేషాలు

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తీస్తున్న కొత్త సినిమా టైటిల్ ఏంటో మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. హైదరాబాద్ వేదికగా ఈరోజు (నవంబరు 15) సాయంత్రం ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. 100 అడుగుల ఎత్తున్న ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో అసలేం రిలీజ్ చేస్తారా అని అభిమానుల మదిలో బోలెడన్ని సందేహాలు. ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ వేసిన రాజమౌళి.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేశారు.

రాజమౌళి ట్వీట్, వీడియో వివరాలు

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో టైటిల్ రివీల్ చేయడంతో పాటు మూవీ థీమ్ ఏంటనేది వీడియో రూపంలో రిలీజ్ చేయబోతున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈవెంట్‌లో స్క్రీన్ పై ప్రసారమైన తర్వాత యూట్యూబ్‌లోనూ ఆ వీడియోని రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో దాదాపు మూడు నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. ఇందులో అన్ని పాత్రలకు సంబంధించిన విజువల్స్, మూవీ స్టోరీ ఏంటనేది చూచాయిగా చూపించడం గ్యారంటీ.

అభిమానుల ఆతృత: మహేశ్ లుక్ పై ఉత్కంఠ

ఇప్పటికే ఈ మూవీలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ లుక్, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ లుక్స్ రిలీజ్ చేశారు. వీటిపై మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతానికి ఫ్యాన్స్ అందరూ కూడా మహేశ్ బాబు లుక్ కోసమే ఎదురుచూస్తున్నారు. మరి లుక్ రిలీజ్ చేస్తారా? నేరుగా వీడియోనే రిలీజ్ చేసి అభిమానులకు జక్కన్న కిక్ ఇస్తారా అనేది చూడాలి? ఇప్పటికే వారణాసి, రుద్ర అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. మరి దేన్ని ఫైనల్ చేశారో మరికొద్ది గంటల్లో తేలనుంe title of the film will be revealed along with a visual to the world… Once it airs on the big screen at the #GlobeTrotter event, we will make it live online…. 🤗🤗🤗

మొత్తంగా, ‘SSMB29’ టైటిల్ మరియు థీమ్ వీడియో విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు రాజమౌళి చేసిన ప్రకటన పెద్ద శుభవార్త. ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్, యూట్యూబ్ రిలీజ్ తో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.