|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SSMB29 : మహేష్ బాబు తండ్రిగా ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు.. రాజమౌళి సినిమాలో ఆ హీరో..

Published: 07-07-2025, 12:16 PM
SSMB29 : మహేష్ బాబు తండ్రిగా ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు.. రాజమౌళి సినిమాలో ఆ హీరో..

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB29 సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

Key Points

1

SSMB29 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

2

మాధవన్ మహేష్ బాబు తండ్రి పాత్రలో నటిస్తున్నారని వార్తలు.

4

మూవీ యూనిట్ త్వరలో కెన్యాకు షూటింగ్ కోసం వెళ్తుందని సమాచారం.

SSMB29 షూటింగ్ వివరాలు

SSMB29 : మహేష్ రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు ఇప్పటికే తెలిసింది. అయితే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం.

SSMB29 సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, హీరో మాధవన్ ని తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. మాధవన్ ఇటీవల కాలంలో డిఫరెంట్ పాత్రలు చేస్తూ, ఆ పాత్రల కోసం తన బాడీని, లుక్ ని మార్చుకుంటూ సినిమాల కోసం కష్టపడుతున్నాడు. దీంతో మహేష్ తండ్రిగా కాస్త ముసలి పాత్రలో కనిపిస్తాడని, అలాగే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని, ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలుపెట్టారని సమాచారం.

మాధవన్ పాత్ర గురించి

అంతకుముందు ఈ పాత్రల కోసం నానా పాటేకర్, విక్రమ్ లను అనుకోని ఇప్పుడు మాధవన్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. రాజమౌళి ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వట్లేదు. ఇది కూడా రూమర్ లా వచ్చి నిజం అవుతుందేమో చూడాలి. త్వరలో ఈ సినిమా షూటింగ్ కి మూవీ యూనిట్ కెన్యా దేశానికి వెళతారని తెలుస్తుంది.

ఇతర నటీనటులు

మొత్తంగా, SSMB29 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాధవన్ పాత్ర వివరాలు మరియు కెన్యా షూటింగ్ పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.