
మహేష్ బాబు-రాజమౌళిల SSMB29 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నవంబర్ 15న భారీ ఈవెంట్ కు ముందు, దర్శకుడు రాజమౌళి అభిమానులకు సూపర్ సర్ ప్రైజ్ అందించారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ఇవాళ విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ వార్తతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
Key Points
మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB29 కోసం యావత్ ఇండియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
నవంబర్ 15న భారీ ఈవెంట్ తో సినిమా టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కానున్నాయి.
ఈ ఈవెంట్ కు ముందే నవంబర్ 7న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు.
హాలీవుడ్ స్థాయిలో రూ.1000 కోట్ల బడ్జెట్ తో SSMB29ను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.
SSMB29పై భారీ అంచనాలు
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా కోసం యావత్ ఇండియా అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, మహేష్ బాబు హీరోగా అవడంతో సినిమాపై(SSMB29) అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇక హాలీవుడ్ రేంజ్ లో దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గ్లొబ్ ట్రాటర్ టాగ్ తో ఇప్పటికే ఈ సినిమాను వరల్డ్ వైడ్ టట్రెండ్ చేస్తున్నాడు రాజమౌళి.
Bhagyashri Borse: రానాకి నేను నచ్చలేదు.. నా యాక్టింగ్ పై అనుమానాలు.. అన్నీ చేశాకే..
రాజమౌళి సర్ ప్రైజ్ అప్డేట్
ఆ హైప్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళుతూ నవంబర్ 15న భారీ ఈవెంట్ జరుపనున్నారు మేకర్స్. దీనికి సంబంధించి ఏర్పాట్లు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ లో సినిమా టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ తోపాటు టీజర్ కూడా విడుదల చేయనున్నారు అని సమాచారం. అయితే, ఈ ఈవెంట్ కి ముందే ఆడియన్స్ కి మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు రాజమౌళి. ఇవాళ అంటే నవంబర్ 7 ఈ సినిమా నుంచి నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు స్వయంగా రాజమౌళి ప్రకటించాడు.
పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ విడుదల సమయం
ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. “ఓపక్క సినిమా క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. మరోవైపు ఈవెంట్ కోసం పనులు. గతంలో ఎన్నడూ లేని విదంగా ఈ ఈవెంట్ జరుగనుంది. నవంబర్ 15న మీరంతా చాలా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను. దానికంటే ముందు ఈ వారమంతా మీరు హుషారుగా ఉండేందుకు ఇవాళ(నవంబర్ 7) పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్ విడుదల కాబోతుంది”అంటూ రాసుకొచ్చాడు రాజమౌళి. దీంతో, అనుకోకుండా వస్తున్న ఈ అప్డేట్ తో ఆడియన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల SSMB29పై అంచనాలను మరింత పెంచింది. భారీ ఈవెంట్ కు ముందు వచ్చిన ఈ సర్ ప్రైజ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. సినిమాపై హైప్ ను రాజమౌళి నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు.


